Begin typing your search above and press return to search.

కాజల్‌ పై చేయి వేయబోయిన వ్యక్తి!

ఏదో ఒక వంక పెట్టుకుని టచ్ చేయాలని ముందుకు దూసుకు వచ్చే వారు ఉంటారు.

By:  Tupaki Desk   |   6 March 2024 10:42 AM GMT
కాజల్‌ పై చేయి వేయబోయిన వ్యక్తి!
X

హీరోయిన్స్‌ పబ్లిక్ కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురు అవ్వడం చాలా కామన్ గా జరుగుతూ ఉంటారు. ఫ్యాన్స్ అంటూ మీదకు వచ్చే వారు చాలా మంది ఉంటారు. ఏదో ఒక వంక పెట్టుకుని టచ్ చేయాలని ముందుకు దూసుకు వచ్చే వారు ఉంటారు. అలాంటి వారి నుంచి సెలబ్రిటీలను బౌన్సర్లు కాపాడుతూ ఉంటారు.

ఎంత మంది బౌన్సర్స్ ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో హీరోయిన్స్‌ పట్ల కొందరు అనుచిత ప్రవర్తన జరుగుతూనే ఉంటుంది. ఇటీవల టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పట్ల ఆమె ఫ్యాన్స్‌ కాస్త కాస్త అటు ఇటుగా అలాగే ప్రవర్తించాడు. ఆమెపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఒక షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవంకు కాజల్‌ అగర్వాల్‌ హాజరు అయ్యింది. కాజల్‌ అగర్వాల్‌ వచ్చిందనే విషయం తెలిసి అక్కడకు పెద్ద ఎత్తున జనాలు పోటెత్తారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు మరియు కాజల్‌ అగర్వాల్‌ పర్సనల్‌ బౌన్సర్స్ కి ఇబ్బంది అయ్యింది.

ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక వ్యక్తి కాజల్ అగర్వాల్‌ వద్దకు చేరుకున ఆమె నడుము పై చేయి వేసి ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే ఎంటి అలా మీదకు వచ్చేస్తున్నావు అంటూ కాజల్‌ వెనక్కి జరిగింది. ఆ వెంటనే బౌన్సర్స్ కూడా అతడిని అక్కడి నుంచి లాగినట్లుగా వీడియోలో చూడవచ్చు.