Begin typing your search above and press return to search.

మెగా156 కోసం పర్ఫెక్ట్ పవర్ఫుల్ పెన్!

ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం దాదాపు ఆరు నెలల సమయం తీసుకోబోతున్నారట. మూడు లోకాల నేపథ్యంలో సినిమా కథను దర్శకుడు రాసుకున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 9:50 AM GMT
మెగా156 కోసం పర్ఫెక్ట్ పవర్ఫుల్ పెన్!
X

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అనుకున్న ఒక రీమేక్ సినిమాను కూడా పక్కన పెట్టి స్ట్రైట్ డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నారు. ఇక సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వశిష్ట మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

మెగా 156 గా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు 'విశ్వంభర' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని ప్రీ ప్రోడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశారు. UV క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతోంది. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం దాదాపు ఆరు నెలల సమయం తీసుకోబోతున్నారట. మూడు లోకాల నేపథ్యంలో సినిమా కథను దర్శకుడు రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కథలో మొత్తంగా ఐదు మంది హీరోయిన్స్ కనిపిస్తారని కూడా టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

అలాగే సినిమాకు టెక్నీషియన్ కోసం దర్శకుడు ప్రముఖులను రంగంలోకి దింపుతున్నాడు. ఇక ఈ సినిమాకు మరొక ప్రముఖ రైటర్ కూడా వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. RRR సినిమాకు మాటలు అందించిన సాయి మాధవ బుర్ర కూడా ఈ ప్రాజెక్టుకు డైలాగ్స్ అందించబోతున్నట్లు లేటెస్ట్ టాక్. ఇదివరకే ఆయన మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు డైలాగ్స్ అందించారు.

ఇక ఇప్పుడు మరోసారి మెగా 156 కోసం వర్క్ చేయబోతున్నారు. దీంతో ప్రాజెక్టు పై అంచనాలు మరింత పెరిగాయి. సాయి మాధవ్ బుర్ర ఇటీవల కాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు బిగ్ బడ్జెట్ సినిమాలకు మాటలు అందిస్తున్నారు. ఇక అడ్వెంచర్ ఫాంటసీ మూవీగా రానున్న ఈ కథకు సాయి మాధవ్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఆయనే వర్క్ చేస్తున్నారు.