Begin typing your search above and press return to search.

RRR హీరోలకి ‘నో’ చెప్పిన పీపుల్స్ స్టార్?

ఇప్పటికే ఓ పాత్ర కోసం క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్‌ని తీసుకొన్నారని టాక్ వినిపిస్తుండగా.. మరో కీలకమైన పాత్ర కోసం ఆర్.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:32 PM GMT
RRR హీరోలకి ‘నో’ చెప్పిన పీపుల్స్ స్టార్?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ గ్యాప్ లో నటీనటులను ఎంపిక చేస్తున్న చిత్ర బృందం.. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పాత్ర కోసం క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్‌ని తీసుకొన్నారని టాక్ వినిపిస్తుండగా.. మరో కీలకమైన పాత్ర కోసం ఆర్. నారాయ‌ణ‌మూర్తిని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.


రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ఓ పాత్ర‌కు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయ‌ణ‌ మూర్తి సరిగ్గా సరిపోతారని బుచ్చిబాబు అండ్ టీమ్ భావించారట. అనుకున్నదే తడవుగా ఇటీవల సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా ఈ సినిమాలో న‌టించ‌డానికి దర్శక నటుడు అంగీక‌రించ‌లేద‌ని టాక్‌ వినిపిస్తోంది. దీంతో చిత్ర‌బృందం ఈ క్యారక్టర్ కోసం మ‌రో సీనియర్ యాక్టర్ ని ఎంపిక చేసే ప‌నిలో ప‌డిందని అంటున్నారు.

నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంప‌ర్‌’ సినిమాలో నారాయ‌ణ‌మూర్తిని నటింపజేయడానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బాగా ట్రై చేసారు. కానిస్టేబుల్‌ మూర్తి పాత్ర కోసం ముందుగా ఆయన్నే సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ పాత్రలో నటించే అవకాశం పోసాని కృష్ణమురళికి దక్కింది.. అది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించడానికి నో చెప్పారట. ఎన్టీఆర్ ఆఫర్ ను రిజెక్ట్‌ చేయడానికి గల కారణాలను ఆర్‌. నారాయణమూర్తి గ‌తంలో ఓ సందర్భంలో వెల్లడించారు. మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారకూడదని అనుకోవడం వల్లనే తిరస్కరించినట్లు చెప్పారు.

''టెంపర్ లో నాకు అంత గొప్ప వేషం ఇవ్వడానికి వచ్చిన పూరీ జగన్నాథ్‌కు నేను సెల్యూట్‌ చేస్తున్నా. ఆ పాత్రలో నేను నటిస్తేనే సినిమా ఆడుతుందని ఆయన నాకు ఆఫర్‌ చేయలేదు. నాతో ఒక గొప్ప క్యారెక్టర్‌ చేయిద్దాం.. డిఫరెంట్‌ వేషం వేయిద్దాం అనే ఉద్దేశంతో నాకు ఇవ్వాలనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఎంతో ప్రేమతో అడిగారు. కానీ, 'నేను ఈ పాత్రలో నటించలేను. నన్ను మన్నించండి' అని అన్నాను. ఎందుకంటే నేను జూనియర్‌ ఆర్టిస్ట్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి కథానాయకుడి స్థాయికి ఎదిగాను. ఇక నేను సినిమాలు చేస్తే ఐదారేళ్లకు మించి చేయను. అందుకే మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేయకూడదని అనుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు'' అని నారాయణమూర్తి తెలిపారు. ఒకవేళ ఇప్పుడు RC 16 ఆఫర్ ని రిజెక్ట్ చేసింది నిజమే అయితే.. దానికి కూడా రీజన్ ఇదే అయ్యుంటుందని అనుకోవచ్చు.

పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయ‌ణ‌ మూర్తి కెరీర్ ప్రారంభం నుంచీ వైవిద్యమైన పంధాలో నడుస్తూ వచ్చారు. నటుడిగా సింగర్ గా నిర్మాతగా రచయితగా, దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన.. తన స్వీయ దర్శక నిర్మాణంలో ప్రజా సమస్యలపైనే సినిమాలు తెరకెక్కిస్తూ వచ్చారు. ఈ విధంగానే 'అర్థరాత్రి స్వాతంత్ర్య' 'చీమల దండు' 'ఎర్రసైన్యం' 'దండోరా' 'ఊరు మనదిరా' లాంటి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. 40 ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినా.. ఇప్పటివరకు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేదు. డబ్బుకు వాల్యూ ఇవ్వకుండా ఒక సాదాసీదా జీవనం సాగిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సేవ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు.