Begin typing your search above and press return to search.

పీపుల్స్ మీడియా ప్రేమ ప్రయోగం.. లవ్ @65

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2024 10:05 AM GMT
పీపుల్స్ మీడియా ప్రేమ ప్రయోగం.. లవ్ @65
X

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆ విధంగా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను వారు తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒకే ఏడాదిలో ఎక్కువ స్థాయిలో సినిమాలను నిర్మిస్తున్న సంస్థగా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రికార్డు క్రియేట్ చేస్తోంది.


ఈ సంస్థలో ప్రస్తుతం వరుసగా సినిమాలు రూపొందుతూ ఉన్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా సెట్స్ పైన ఉన్నాయి. ఇక ఈ సంస్థ నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్టులలో లవ్ @ 65 అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవల విడుదల చేశారు.

రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా నటిస్తున్నారు. చాలాకాలం తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కావడంతో ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడు వైవిధ్యమైన కథలలో కూడా కథానాయకుడిగా నటిస్తూ ఉన్నారు. ఇక ఈసారి ఆయన ఈ లవ్ @65 అనే సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు.

ముఖ్యంగా జయప్రద ఈ సినిమాలో ఆయనకు జోడిగా నటిస్తూ ఉన్నారు. 65 ఏళ్ల వయసులో ప్రేమలో పడిన జంటకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే అంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో డైరెక్ట్ చేసింది మరెవరో కాదు.. ఒకప్పుడు మనసంతా నువ్వే - నేనున్నాను వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విఎన్ ఆదిత్య. ఆయన కూడా ఇటీవల కాలంలో రెగ్యులర్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

ఇక ఈ సినిమాలో సునీల్, అజయ్ వంటి ప్రముఖ నటులు కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. తప్పకుండా సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుంది అని చిత్ర యూనిట్ చెబుతోంది. నేటితరం జనరేషన్ కు అర్ధం అయ్యేలా ఈ సినిమాలో ఒక మంచి సందేశం కూడా ఉండబోతుందట ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు టీజీ విశ్వప్రసాద్ వివేక్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.