Begin typing your search above and press return to search.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!

అదే సమయంలో ఈ ఏడాది తమ బ్యానర్ నుంచి పెద్ద సినిమాలు వస్తున్నాయని, అవి పక్కా తమకు మంచి లాభాలు తెచ్చిపెడతాయని విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   19 July 2025 5:00 PM IST
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే!
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతేడాది అనేక సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేవు. ఫలితంగా ప్రొడక్షన్ హౌస్ కు భారీ నష్టాలు మిగిలాయి. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆయా ఇంటర్వ్యూల్లో పలుమార్లు స్వయంగా అంగీకరించారు.

అదే సమయంలో ఈ ఏడాది తమ బ్యానర్ నుంచి పెద్ద సినిమాలు వస్తున్నాయని, అవి పక్కా తమకు మంచి లాభాలు తెచ్చిపెడతాయని విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయం సాధిస్తాయని తమకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు. అయితే ఆయన చెప్పినట్లే పీపుల్స్ మీడయా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి ఈ ఏడాది రెండు భారీ ప్రాజెక్ట్ లు రానున్నాయి.

అందుకో ఒకటి ప్రభాస్ రాజాసాబ్ కాగా, మరొకటి తేజ సజ్జా లీడ్ రోల్ లో తెరకెక్కిన మిరాయ్. ఇందులో ప్రభాస్ రాజాసాబ్ పై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీని కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ స్టార్ డమ్, సంజయ్ దత్ లాంటి స్టార్ కాస్ట్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

మరోవైపు తేజ సజ్జా మిరాయ్. కేవలం కథను నమ్మి నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాపై భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే ఇటీవల రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేసింది. సినమాకు కావాల్సిన బజ్ ను ఇది తీసుకొచ్చింది. ఈ టీజర్ తో కథలో బలం ఉన్నట్లు ప్రేక్షకులు నమ్ముతున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ రోల్ లో నటించడం ఇంకా ప్లస్ అయ్యింది. ఇది రాజాసాబ్ కంటే ముందే సెప్టెంబర్ 05న థియేటర్లలో రిలీజ్ కానుంది.

అలా రానున్న 5 నెలల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రెండు భారీ ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికైతే ఈ రెండు ప్రాజెక్ట్ లపైనా మంచి బజ్ ఉంది. మారుతి తెరకెక్కించి రాజాసాబ్, కార్తిక్ దర్శకత్వం వహించిన మిరాయ్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం పక్కా అని నమ్ముతున్నాకు. అనుకున్నట్లే ఈ సినిమాలు మంచి విజయం సాధించడం కూడా ఈ సంస్థకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి భారీ లాభాలు తెచ్చిపెడితే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.