Begin typing your search above and press return to search.

పెండ్యులం మూవీ ఎలా ఉంది..?

కొత్త కథలతో ప్రేక్షకులను రంజింప చేసే ప్రయత్నంలో భాగంగా మలయాళ మేకర్స్ చేసే ప్రయోగాలు అన్నీ ఇనీ కావు.

By:  Tupaki Desk   |   22 May 2025 7:37 PM IST
పెండ్యులం మూవీ ఎలా ఉంది..?
X

కొత్త కథలతో ప్రేక్షకులను రంజింప చేసే ప్రయత్నంలో భాగంగా మలయాళ మేకర్స్ చేసే ప్రయోగాలు అన్నీ ఇనీ కావు. అసలు ఇలాంటి ఐడియాలు వాళ్లకు మాత్రమే ఎలా వస్తాయి అన్న ప్రశ్న కూడా కొందరికి వస్తుంది. కథ కథనాలు న్యాచురల్ గా ప్రతి ప్రేక్షకుడిని టచ్ చేసేలా మలయాళ సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయి. ఐతే కొన్ని కాన్సెప్ట్ బాగున్నా కాస్త నిరాశ పరుస్తాయి. ఏది ఏమైనా మలయాళ కథలు డిఫరెంట్ గా ఉంటాయన్నది నిజం. ఇదే తరహాలో లేటెస్ట్ గా పెండ్యులం అనే సినిమా కూడా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది.

లూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన థ్రిల్లర్ సినిమా ఈ పెండ్యులం. రెజిన్ ఎస్.బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ బాబు, అనుమోల్, ప్రకాష్ బారె లీడ్ రోల్స్ లో నటించారు. లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంతకీ అసలు పెండ్యులం కథ ఏంటంటే.. కేరళ డాక్టర్ అయిన మహేష్ నారాయణన్ (విజయ్ బాబు) తన ఫ్యామిలీ తో జాలీ ట్రిప్ కి వెళ్తాడు. అక్కడ ఒకచోట ఆగడంతో మహేష్ తన పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ టైం లో కారు లాక్ అవ్వడంతో ఆ నైట్ అక్కడ ఉండాల్సి వస్తుంది. ఐతే తెల్లారేసరికి మహేష్ ఒకచోట స్పృహ కోల్పోయి పడి ఉంటాడు. మహేష్ కి స్ప్రుహ వచ్చాక తనని లారీ ఢీ కొట్టిందని చెబుతాడు. అంతేకాదు అతని కలలో అమీర్, ఏంజెల్ లు వస్తారు. ఇంతకీ అసలు మహేష్ కి వచ్చిన కల ఏంటి.. ఈ అమీర్ ఏంజెల్ ఎవరు అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.

నిద్రలో వచ్చే కలలు తెల్లారగానే మర్చిపోతాం. అంతేకాదు ఇలా కల కనాలని మనం అనుకుంటే అది జరగదు. కానీ లూసిడ్ డ్రీమింగ్ అనే కాన్సెప్ట్ తో కావాల్సిన వారిని మనం కలలో కలుస్తాం. మనకు నచ్చినట్టుగా నిజ జీవితంలో లేకపోతే కలలో ఉండొచ్చు కదా అంటూ లూసిడ్ డ్రీమింగ్ కాన్సెప్ట్ తో వచ్చాడు దర్శకుడు. ఐతే ఈ కొత్త కథను తెర మీద కూడా అదే తరహాలో చూపించారు.

దర్శకుడు రెజిన్ తొలి సినిమానే చాలా క్లారిటీతో తీశాడు. ఐతే మహేష్ ఫ్యామిలీ సీన్స్ ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. మహేష్ పాత్రలో విజయ్ బాబు నటన బాగుంటుంది. అనుమోల్ కూడా ఆకట్టుకుంటుంది. ఐతే జరిగే కథకు డ్రీమ్ కి ముడి పెట్టి వచ్చే సీన్స్ లో కాస్త కన్ ఫ్యూజన్ ఉంటుంది. ఓవరాల్ గా ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూసిన భావన అయితే ఆడియన్స్ కి కలుగుతుంది.