Begin typing your search above and press return to search.

#ఆర్సీ 16 స్టోరీపై మ‌రో ట్విస్ట్ ఇచ్చిన బాబు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 May 2025 8:20 AM
#ఆర్సీ 16 స్టోరీపై మ‌రో ట్విస్ట్ ఇచ్చిన బాబు!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన చ‌ర‌ణ్ లుక్...మాస్ అప్పిరియ‌న్స్ తో ఇది ప‌క్కా మాస్ చిత్ర‌మ‌ని తెలి పోయింది. మాస్ కంటెంట్కి క్రికెట్..కుస్తీ ఆట‌ల నేప‌థ్యాన్ని జోడించడంతో కంటెంట్ ఆస‌క్తిక‌రంగా మారిం ది. పీరియాడిక్ చిత్రంగా ఫోక‌స్ అవుతుంది. ఇదంతా అంద‌రికీ తెలిసిందే. మ‌రి సినిమాకు కీల‌కమైన అంశం ఏది? సెట్ర‌ల్ పాయింట్ ఏది? అంటే బుచ్చిబాబు మ‌రో కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చాడు.

సినిమాకు సంబంధించి అస‌లు పాయింట్ క్రికెట్ క్రీడ నేప‌థ్యం కాద‌ని... క‌థ‌లో బ‌ల‌మైన‌ ఎమోష‌న్ అన్న‌దే సెంట్ర‌ల్ పాయింట్ గా రివీల్ చేసాడు. అది చ‌ర‌ణ్ పాత్ర‌ను బ‌లంగా ఆవ‌హించి ఉంటుద‌న్నాడు. సినిమా లో హీరో పాత్ర చాలా బ‌లంగా ఉంటుంద‌ని... ఆ పాత్ర‌లో ఎమోష‌న్ పీక్స్ లో ఉంటుంద‌ని..చ‌ర‌ణ్ ఇంత వ‌ర‌కూ ఇలాంటి స్ట్రాంగ్ ఎమోష‌న్ ఏ సినిమాలో చూపించి ఉండ‌ర‌ని ధీమా వ్య‌క్తం చేసాడు.

చ‌ర‌ణ్ రియల్ క్యార‌క్ట‌రైజేష‌న్ కి కొన్ని ద‌గ్గ‌ర పొలిక‌లు ఉంటాయన్నారు. బుచ్చిబాబు ఎమోష‌న్ అనే పాయింట్ తోనే క‌థ‌ను న‌డిపిస్తున్న‌ట్లు తెలుస్తుంది. `ఉప్పెన` లోనూ తండ్రీ-కూతురు మ‌ధ్య బ‌లమైన ఎమోష‌న్ చూపించాడు. ప్రేమ‌కు- లైంగిక కోరిక‌కు ఎలాంటి సంబంధం లేద‌ని..ప్రేమ అనేది కేవ‌లం మ‌న‌సుకు మాత్రమే సంబంధించింద‌ని బ‌లంగా చెప్పాడు. అది ఎంతో క‌న్విన్సింగ్ గానూ ఉంది.

`పెద్ది`లో కూడా ఎమోష‌న్ అనే పాయింట్ ని బేస్ చేసుకునే క‌థ‌ను అల్లిన‌ట్లు అత‌డి మాట‌ల్లో అర్ద‌మ వుతుంది. ఇక ఆన్ సెట్స్ లో చ‌ర‌ణ్ వేరుగా ఉంటార‌న్నారు. కెమెరా ముందుకొస్తే భిన్న‌మైన చ‌ర‌ణ్ ని చూస్తామ‌న్నారు. తాను టేక్ ఒకే చేసినా మ‌రో టేక్ అంటూ ఒత్తిడి తెస్తాడ‌ని...సీన్ విష‌యంలో చ‌ర‌ణ్ ప‌ర్పెక్ష‌న్ ఎంతో బాగుంటుంద‌న్నాడు. ఇలాంటి న‌టులు చాలా అరుదుగా ఉంటార‌న్నారు.