Begin typing your search above and press return to search.

'పెద్ది' రెండు రోజులు లెక్క ఎంతంటే?

తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్ ప్రకారం, రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.181.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

By:  M Prashanth   |   6 Jun 2026 3:07 PM IST
పెద్ది రెండు రోజులు లెక్క ఎంతంటే?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించారు. భారీ అంచనాల మధ్య జూన్ 4న విడుదలైన ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై కూడా దాని ఎఫెక్ట్ కనిపించింది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు కథను తెరకెక్కించిన తీరు.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచాయి.

తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన పెద్ది రెండో రోజూ తన జోరు కొనసాగించింది. తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్ ప్రకారం, రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.181.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మేకర్స్.. బాక్సాఫీస్ ఛాంపియన్ గా పెద్ది దూసుకెళ్తోందని పేర్కొన్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర విలేజ్ ఎన్విరాన్మెంట్ ను రిఫ్లెక్ చేసే స్టోరీ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులకు దగ్గరగా అనిపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇతర సౌత్ లాంగ్వేజెస్ తోపాటు హిందీ మార్కెట్‌ లో కూడా సినిమా మంచి వసూళ్లు రాబడుతున్నట్లు సమాచారం.

ఓవర్సీస్ మార్కెట్‌ లోనూ పెద్ది ప్రభావం క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చిత్రం ఇప్పటికే 2.2 మిలియన్ డాలర్ల మార్క్‌ ను అందుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్‌ కు ఉన్న గ్లోబల్ ఫ్యాన్ బేస్, సినిమాపై ముందుగానే ఏర్పడిన హైప్ ఓవర్సీస్ వసూళ్లకు హెల్ప్ అయినట్లు తెలుస్తోంది. ఇక చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు.

రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ తో పాటు శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, రావు రమేష్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా నిర్మాణ వ్యయం సుమారు రూ.350 కోట్ల వరకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా ఫుల్ బాక్సాఫీస్ రన్ పై ఆసక్తి నెలకొంది.

రెండు రోజుల్లోనే రూ.181.8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి లభిస్తున్న ఆదరణ, రామ్ చరణ్ స్టార్ ఇమేజ్‌ ను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కూడా పెద్ది బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు తొలి రెండు రోజుల లెక్కలు మూవీ టీమ్ లో మరింత జోష్ నింపాయని చెప్పాలి.