బుచ్చిబాబు నెక్స్ట్ హీరో అతడే!
కానీ తప్పని సరిగా తారక్ తోనే తర్వాత సినిమా ఉంటుందని కుండబద్దలు కొట్టేసాడు. అలాగే ఇక్కడ తారక్ కూడా బుచ్చిబాబును అంతే బలంగా నమ్మాలి.
By: Tupaki Desk | 4 April 2025 5:30 PMమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్టోరీ నేరేట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ చివరి నిమిషంలో ఆ కాంబినేషన్ బ్రేక్ అయింది. దీంతో తారక్ స్థానంలో చరణ్ వచ్చాడు. అలాగని ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీని చరణ్ తో పట్టాలెక్కించలేదు. రెండు వేర్వేరు స్టోరీలు. చరణ్ ఇమేజ్... బాడీ లాంగ్వేజ్ కి తగ్గ స్టోరీతో బుచ్చిబాబు మొదలు పెట్టిన చిత్రమే 'పెద్ది'.
ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అటుపై బుచ్చిబాబు ఏ స్టార్ తో సినిమా చేస్తాడు? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే ఓ స్టోరీ రిజెక్ట్ చేసాడు. మరి ఇలాంటి పరిణామం నేపథ్యంలో మళ్లీ తారక్ వద్దకు వెళ్లి మరో స్టోరీ చెబుతాడా? అతడిని లైన్ లో పెడ తాడా? అప్పటికీ 'పెద్ది' రిలీజ్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది.
హిట్ అయిందంటే? బుచ్చి బాబు వెంటే స్టార్ హీరోలు పడతారు. పాన్ ఇండియా సంచలనం ప్రభాస్ పిలిచినా పిలవొచ్చు. మరి ఇలాంటి పాజిటివ్ సైన్ లో రిజెక్ట్ చేసిన తారక్ వద్దకు బుచ్చి వెళ్తాడా? అంటే నో డౌట్ తన తదుపరి సినిమా తారక్ తోనే ఉంటుందని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేసాడు. కానీ పాత స్టోరీకి రిపేర్లు చేసి వెళ్తాడా? లేక ఫ్రెష్ కంటెంట్ తో వెళ్తాడా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
కానీ తప్పని సరిగా తారక్ తోనే తర్వాత సినిమా ఉంటుందని కుండబద్దలు కొట్టేసాడు. అలాగే ఇక్కడ తారక్ కూడా బుచ్చిబాబును అంతే బలంగా నమ్మాలి. అది జరగాలంటే? 'పెద్ది' కచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. ఈ సినిమా ఫలితం చాలా వరకూ తారక్ ఛాన్స్ తీసుకునే విషయంలో నిర్ణేతగా మారే అవకాశం లేకపోలేదు. మరి ఇదంతా జరుగుతుందా? లేదా? అన్నది తేలడానికి 2026 వరకూ వెయిట్ చేయాల్సిందే.