Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ అడ్డాల.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ వస్తాయా?

కానీ పెదకాపు సినిమా ఇచ్చిన షాక్ ఇప్పుడు అతని కెరీర్ పై ఎంత ప్రభావం చూపుతుంది అనేది హాట్ టాపిక్ మారింది. బ్రహ్మోత్సవం సినిమా కంటే చాలా చేదు ఫలితాన్ని ఈ సినిమా మిగిల్చింది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 1:30 AM GMT
శ్రీకాంత్ అడ్డాల.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్స్ వస్తాయా?
X

కొత్త బంగారులోకం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు ప్రొడక్షన్లో చాలా కాలమే పనిచేశాడు. సహాయక దర్శకుడిగా అక్కడే ఎక్కువగా వర్క్ చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో కూడా మరో బిగ్ సక్సెస్ అందుకున్నాడు.

ఆ సినిమా తోనే మహేష్ బాబుకు కూడా చాలా దగ్గరయిపోయిన శ్రీకాంత్ బ్రహ్మోత్సవం అనే సినిమా చేసే ఛాన్స్ కూడా కొట్టేసాడు. దీంతో అతను స్టార్ దర్శకుల లిస్టులో చేరిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ సినిమా అతన్ని మామూలు దెబ్బ కొట్టలేదు. అప్పటివరకు ఓ మేరకు డిజాస్టర్ చూసిన మహేష్ బాబు దాంతో కెరీర్లో ఎప్పుడూ లేనంత డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు.

శ్రీకాంత్ కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అతనితో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే మంచి సక్సెస్ అందుకోవచ్చు అనే నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక ఆ నమ్మకంతోనే వెంకటేష్ సురేష్ బాబు నారప్పతో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఓటీటీలోనే విడుదల అయ్యింది. మంచి గుర్తింపు కూడా అందుకుంది. అయితే ఇప్పుడు పెదకాపు 1 సినిమాతో కూడా మళ్లీ మంచి సక్సెస్ అందుకోవాలని తన డ్రీమ్ ప్రాజెక్ట్ లకు ఒక బాట వేయాలని అనుకున్నాడు శ్రీకాంత్ అడ్డల.

కానీ పెదకాపు సినిమా ఇచ్చిన షాక్ ఇప్పుడు అతని కెరీర్ పై ఎంత ప్రభావం చూపుతుంది అనేది హాట్ టాపిక్ మారింది. బ్రహ్మోత్సవం సినిమా కంటే చాలా చేదు ఫలితాన్ని ఈ సినిమా మిగిల్చింది. పెట్టుబడికి కనీసం 10 శాతం నష్టాలను కూడా తగ్గించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీంతో శ్రీకాంత్ నెక్స్ట్ అవకాశాలు అందుకుంటాడా లేదా అనేది కూడా ఇప్పుడు సందేహంగా మారింది.

ఇంతకుముందే శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్వెల్ ఉంటుంది అని అన్నాడు. అంతేకాకుండా అన్నాయ్ అని ఒక మల్టీస్టారర్ ప్రాజెక్టును కూడా చేసే అవకాశం ఉన్నట్లు హింట్ అయితే ఇచ్చేసాడు. గతంలో అతను మెగాస్టార్కు కూడా ఆ కథను వినిపించడం జరిగింది. కానీ ఆ లోపు మంచి సక్సెస్ అందుకుని ట్రాక్లోకి రావాలని అనుకున్న శ్రీకాంత్ కు ఇప్పుడు పెదకాపు ఎటు దారి లేకుండా చేసింది. మరి ఈ క్రిటికల్ పరిస్థితి నుంచి అతను ఏ విధంగా మరో అవకాశం అందుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి.