Begin typing your search above and press return to search.

పెద కాపు జోరు గట్టిగానే..

సెప్టెంబర్​ 29న సినిమా వస్తుండడంతో 28న తేదీన రాత్రి ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​లోని సంధ్య 70ఎంఎం థియేటర్లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు అనౌన్స్​ చేశారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 9:39 AM GMT
పెద కాపు జోరు గట్టిగానే..
X

టాలివుడ్ ప్రముఖ డైరెక్టర్​ శ్రీకాంత్ అడ్డాల కాస్త గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం పెద కాపు - 1. డిఫరెంట్ కాన్సెప్ట్​తో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సామాన్యుడి సంతకం అనేది ట్యాగ్​ లైన్​. కొత్త యాక్టర్స్​తో అడ్డాల చేస్తున్న ఈ ఎక్స్​పెరిమెంట్​పై కాస్త బజ్​ తక్కువగానే ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడది కాదని అర్థమైపోయింది.


రీసెంట్​గా పెద్ద కాపు మూవీటీమ్​ ధైర్యంతో ఓ అడుగు ముందుకేసి ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అయింది. సెప్టెంబర్​ 29న సినిమా వస్తుండడంతో 28న తేదీన రాత్రి ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​లోని సంధ్య 70ఎంఎం థియేటర్లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు అనౌన్స్​ చేశారు. ఆ రోజు రాత్రి 9.30 గంటలకు షో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బుక్​ మైషో, పేటీఎమ్​లో అడ్వాన్స్​ బుకింగ్స్ ఓపెన్ చేయగా అవన్నీ ఫుల్ అయిపోయాయని తెలిసింది. ఈ విషయాన్ని మూవీటీమ్ అధికారికంగా తెలుపుతూ సినీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపింది. మరిన్ని షోలు యాడ్​ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ రేంజ్​లో రెస్పాన్స్​ రావడం హర్షం వ్యక్తం చేసింది.

ఇకపోతే ఈ చిత్రంలో విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ బాగానే అనిపించాయి. ఈ కథలో చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్​ ఉన్నట్లు అర్థమవుతోంది.ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి గ్రాండ్​గా నిర్మించారు. ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్​గా నటించింది.

తనికెళ్ల భరణి, నాగబాబు, రావు రమేశ్‌, బ్రిగడ సాగ, అనసూయ, రాజీవ్‌ కనకాల, నరేన్‌, ఈశ్వరిరావు తదితరులు సినిమాలో ఇత ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కీ జె.మేయర్‌ అందిన సంగీతం కూడా బాగానే ఉంది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం అందించారు.

ఇకపోతే ఈ వారం పెద కాపుతో పాటు బోయపాటి రామ్​పోతినేని స్కంద, చంద్రముఖి 2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ మూడు చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి?