Begin typing your search above and press return to search.

పెదకాపు 2 ట్విస్ట్.. అడ్డాల యూ టర్న్!?

ప్రస్తుతం వరుస హిట్స్ తో ముందుకు కొనసాగుతున్న శ్రీకాంత్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   12 Oct 2023 1:30 AM GMT
పెదకాపు 2 ట్విస్ట్.. అడ్డాల యూ టర్న్!?
X

కొత్త బంగారులోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గత కొంతకాలంగా ఎలాంటి సినిమా చేసిన కూడా డిజాస్టర్ చూస్తున్నాడు. ముఖ్యంగా బ్రహ్మోత్సవం సినిమా తర్వాత శ్రీకాంత్ నుంచి సరైన సినిమా రావడం లేదు.

నారప్ప అనే సినిమాతో పరవాలేదు అనిపించాడు కానీ అది తమిళ రీమేక్. అందులోనూ ఓటీటీ లో విడుదలైంది. దీంతో వెండితెరపై అతను మ్యాజిక్ క్రియేట్ చేద్దామని అనుకున్నాడు. ఇప్పటివరకు ఎవరు చూడని విధంగా తన స్టైల్ ను మార్చిన అడ్డాల పెదకాపు 1 అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇదే కథకు రెండో భాగాన్ని కూడా తీసుకురావాలని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తెచ్చిన నష్టాలను బట్టి చూస్తే సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. అయితే నిర్మాత కూడా మళ్లీ దర్శకుడిని నమ్మే అవకాశం కూడా లేదు. దీంతో శ్రీకాంత్ ఒక యువ హీరో వైపు యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస హిట్స్ తో ముందుకు కొనసాగుతున్న శ్రీకాంత్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట.

గతంలోనే ఒక కథపై చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా మళ్లీ ఆ కథలోనే కొన్ని మార్పులు చేసి వినిపించాడట. దీంతో ఆ స్క్రిప్ట్ విషయంలో హీరో మళ్ళీ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఇంకా హీరో గారు తన నిర్ణయమేమి చెప్పలేదట. శ్రీకాంత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాడు.

ఎందుకంటే పెదకాపు ఇచ్చిన ఫలితంతో ఇప్పుడు అతనితో వేరే హీరోలు సినిమా చేయడానికి అంతగా సాహసం చేయకపోవచ్చు. కానీ శ్రీకాంత్ టాలెంట్ ను నమ్మే కొందరు ఉన్నారు. తనకు సింక్ అయిన వారితోనే తదుపరి సినిమాను తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.

అలాగే అతనికి నటుడిగా కూడా అవకాశాలు వస్తే చేయాలని ఆలోచనలో ఉన్నాడు. పెదకాపులో అతను ఒక పాత్రలో నటించిన విధానానికి మంచి ప్రశంసలు దక్కాయి. మరి ఇండస్ట్రీలో దర్శకులు శ్రీకాంత్ టాలెంట్ ను ఉపయోగించుకుంటారో లేదో చూడాలి.