Begin typing your search above and press return to search.

గ్లోబ‌ల్ స్టార్ ఎంతగా సపోర్ట్ చేసినా కానీ..!

దీంతో నెపో కిడ్ గా ప్ర‌చారం వ‌చ్చింది.. కానీ ఏం లాభం.. చివ‌రికి బిగ్ బాస్ టైటిల్ వేరొక‌రికి ద‌క్కింది. దీంతో నీర‌స‌ప‌డిన మ‌న్నారా...సైలెంట్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:41 PM GMT
గ్లోబ‌ల్ స్టార్ ఎంతగా సపోర్ట్ చేసినా కానీ..!
X

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా క‌జిన్ గా సుపరిచితురాలు మ‌న్నారా చోప్రా. అయితే ఈ భామ త‌న సోద‌రి ట్యాగ్ ని ఆరంగేట్రంలో అంత‌గా ఉప‌యోగించ‌లేద‌నే చెప్పాలి. టాలీవుడ్ లో ఈ బ్యూటీ అడుగుపెట్టిన‌ప్పుడు ప్రియాంక చోప్రా క‌జిన్ ని అని అంత‌గా చెప్ప‌లేదు. ప్ర‌తిభ‌తోనే ఎద‌గాల‌ని త‌పించింది. కానీ హిందీ మీడియా ప్ర‌చారం ద్వారా ఈ విష‌యాలు ఇక్క‌డా తెలిసాయి. అదంతా స‌రే కానీ.. కెరీర్ లో చెప్పుకోద‌గ్గ ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేని ఈ బ్యూటీ ద‌శాబ్ధం పైగానే టాలీవుడ్ తో స‌త్సంబంధాల‌ను కొన‌సాగిస్తూ కెరీర్ బండిని లాగించేస్తోంది.


కానీ ఎందుక‌నో మ‌న్నారా చోప్రాకు ఆశించిన‌న్ని పెద్ద అవ‌కాశాలు రాలేదు. అలాగే ఇండ‌స్ట్రీలో పార్ట్ టైమ్ జాబ‌ర్ లా అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాలు చేసి ఎటో వెళుతుంది. ఇక ఇటీవ‌ల పూర్తిగా అవ‌కాశాలు జీరో అయిపోయిన త‌రుణంలో బిగ్ బాస్ 17లో బోలెడంత సంద‌డి చేసింది మ‌న్నారా చోప్రా. ఇంటి స‌భ్యుల్లో మ‌న్నారా గేమ్ చూసిన కొంద‌రు ఈ బ్యూటీ సైలెంటుగా టైటిల్ ని ఎగ‌రేసుకుపోతుందా? అంటూ డిబేట్ పెట్టారు.

సోద‌రి కోసం ఏకంగా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా బ‌రిలోకి దిగి బోలెడంత ప‌బ్లిసిటీ చేసింది.. మ‌న్నారా పాత వివాదం విష‌యంలో ప్రియాంక చోప్రా త‌న‌ను ఎలా డిపెండ్ చేసిందో కూడా ఈసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో నెపో కిడ్ గా ప్ర‌చారం వ‌చ్చింది.. కానీ ఏం లాభం.. చివ‌రికి బిగ్ బాస్ టైటిల్ వేరొక‌రికి ద‌క్కింది. దీంతో నీర‌స‌ప‌డిన మ‌న్నారా...సైలెంట్ అయిపోయింది.

ఈసారి బిగ్ బాస్ సీజ‌న్ 17 టైటిల్ ని మున్నావ‌ర్ విన్ అయ్యారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన సాంప్రదాయ శైలిలో మున్వర్‌ను బిగ్ బాస్ 17 ఛాంపియన్‌గా ప్రకటించి అతడి చేతిని పైకి లేపడంతో ఆ స‌మ‌యంలో ఎగ్జ‌యిట్ మెంట్ ఊపేసింది. ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.