Begin typing your search above and press return to search.

నిక్ ఒడిలో పీసీ..ఇలా పేంప‌ర్ చేస్తే ఎలా!

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. పీసీ-నిక్ దంప‌తుల్ని ఇలా చూసి అభిమానుల‌ కు క‌న్నుల విందుగా ఉంది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:53 AM GMT
నిక్ ఒడిలో పీసీ..ఇలా పేంప‌ర్ చేస్తే ఎలా!
X

ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ ల జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ దంప‌తుల‌ కు ఖాళీ స‌మ‌యం కుదిరితే వెకేష‌న్ లో మోడ్ లోకి వెళ్లిపోతారు. ప్ర‌పంచ దేశాల్ని చుట్టేసే బాధ్య‌త‌లు తీసుకుంటారు. అందులోనూ బీచ్ అందాల్ని అయితే క్ష‌మించ‌రు. ఆ సొగ‌బుల్ని జంట ఆస్వాదించాల్సిందే. ఆర‌కంగా ఆద‌ర్శ దంప‌తులుగా పీసీ-నిక్ జోడీ నిరంతరం నెట్టింట హాట్ టాపిక్. తాజాగా వెకేష‌న్ లో ఉన్న ఓ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది.


అందులో పీసీ బికినీ ధ‌రించి భ‌ర్త ఒడి లో కుర్చుంది. టూపీస్ దుస్తుల్లో క‌ళ్ల‌కు అద్దాలు ధ‌రించి జోడీ కెమెరాకి చిక్కింది. భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రు తీక్ష‌ణంగా చూస్తున్నారు. నిక్ నిక్క‌రు..షోల్డ‌ర్ లెస్ టీష‌ర్ట్ ధ‌రించ‌గా..త‌ల‌కి వైట్ క‌ల‌ర్ క్యాప్ ధ‌రించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. పీసీ-నిక్ దంప‌తుల్ని ఇలా చూసి అభిమానుల‌ కు క‌న్నుల విందుగా ఉంది. ప‌బ్లిక్ గా ముద్దులు పెట్టుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి బీచ్ లో కొంటె ప‌నుల వ‌ర‌కూ ప్ర‌తీ విష‌యంలో ఈ జోడీ ఎంతో ఓ పెన్ గా ఉంటారు.

సోష‌ల్ మీడియా లో పిక్ రిలీజ్ అయితే అది ఎలా వైర‌ల్ సెన్షేష‌న్ అవ్వాలో? ముందే జోడీ ఓ ప్లానింగ్ తో ఉంటుంది. తాజా పిక్ ని ఉద్దేశించి కామెంట్ బాక్స్ లో కామెంట్లు ఆస‌క్తిక‌రం. ఇక పీసీ కెరీర్ సంగ‌తి చూస్తే! వృత్తిప‌రంగా ఎలాంటి ఢోకాలేదు. మూడు పువ్వులు ఆరు కాయ‌లు అన్న చందంగా సాగిపోతుంది. ఆమెరికాలో కాపురం పెట్టిన త‌ర్వాత పూర్తిగా అక్క‌డ జీవ‌న విధానినికి అల‌వాటు ప‌డింది.

వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇటీవ‌లే సీటాడెల్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ సిరీస్ అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ సిరీస్ కార‌ణంగా దాదాపు 2000 కోట్ల రూపాయాలు న‌ష్టం వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.