Begin typing your search above and press return to search.

PC న్యూఇయ‌ర్ వేడుక‌లు ఇంత ఆల‌స్యంగా..!

మెక్సికోలో న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలను చూస్తుంటే పీసీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 4:06 AM GMT
PC న్యూఇయ‌ర్ వేడుక‌లు ఇంత ఆల‌స్యంగా..!
X

ప్రియాంక చోప్రా జోనాస్ త‌న కుమార్తె భ‌ర్త‌తో క‌లిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన పోటోలు ఆల‌స్యంగా వెబ్ లోకి వ‌చ్చాయి. సోషల్ మీడియాలో తాజా ఫోటో డంప్ వైర‌ల్ గా మారింది. నిక్ జోనాస్ - కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి తన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోల‌ను పీసీ తాజాగా షేర్ చేసింది.


మెక్సికోలో న్యూ ఇయర్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలను చూస్తుంటే పీసీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అన్నింటికంటే మాల్టీ మేరీ చోప్రా జోనాస్ పాట‌ పాడిన వీడియో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీ స‌హా తల్లి మధు చోప్రాతో పీసీ పోజులిచ్చారు. కుటుంబం బీచ్‌లో కూల్‌గా గడిపారు. ప్రియాంక చోప్రా బ్లాక్ స్విమ్‌సూట్‌లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. మరో ఫోటోలో ఆమె నిక్ జోనాస్‌తో పోజులిచ్చింది. బ్లూ బాడీ హగ్గింగ్ కటౌట్ డ్రెస్‌లో పీసీ అద్భుతంగా కనిపించింది. ఒక ఫోటోలో, ఆమె తల్లి మధు చోప్రాతో పోజులిచ్చింది.

నిక్, ప్రియాంక మరియు మాల్తీ ప్రయాణిస్తున్న వీడియో కూడా ఆక‌ట్టుకుంది. చిన్నారి మాల్తీ పాట‌ పాడుతున్న వీడియో ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది. ప్రియాంక చోప్రా ఈ వీడియోలో ముసిముసి నవ్వులు ఆపుకోలేకపోతోంది. ప్రియాంక క్యాప్ష‌న్ ఇలా ఉంది, ``నా ఆత్మను పోషించడానికి కొంత సమయం పట్టింది. 2023లో నేను ఇలా గడిపాను.. బహుశా నేను ఇప్పటికీ ఇలానే ఉన్నాను. శాంతి, విశ్రాంతి, కుటుంబం, ప్రేమ, ఆనందం.. 2024 కోసం ఇక్కడ ఉంది. మీ ప్రియమైన వారిని దగ్గరగా ఉంచండి. మేము అలా ఉన్నాము.. మీకు వీలైతే చాలా అదృష్టవంతులు. నూతన సంవత్సర శుభాకాంక్షలు`` అని అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే.. ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవల అమెరికన్ వెబ్ సిరీస్ `సిటాడెల్‌`లో తన యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తదుపరి అమెరికన్ చిత్రం `లవ్ ఎగైన్‌`లో పీసీ కనిపించింది. పాపుల‌ర్ స్టార్ సామ్ హ్యూగన్‌తో పీసీ కెమిస్ట్రీ ఇప్ప‌టికే ప్రేక్షకులను ఆకర్షించింది. అలాగే త‌దుప‌రి చిత్రం `హెడ్స్ ఆఫ్ స్టేట్` షూటింగ్‌లోను ప్రియాంక‌ బిజీగా ఉంది. ఈ చిత్రంలో ఇద్రిస్ ఎల్బా , జాన్ సెనాతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేస్కుంటోంది. ఇందులో దేశాధినేత‌గా క‌నిపించ‌నుంది. బాలీవుడ్ చిత్రం జీ లీ జరాలో కూడా కనిపించనుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం లో ఈ చిత్రం 2019 లో ప్రకటించారు. అయితే, ప్రియాంక చోప్రా డేట్ల‌ సమస్య కారణంగా ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఈ చిత్రం ముగ్గురు అమ్మాయిల మధ్య స్నేహం నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక ప్రధాన పాత్రలలో నటించ‌నున్నారు. మ‌రోవైపు బిజీ షెడ్యూళ్ల‌తో కీల‌క‌మైన కుటుంబ ఫంక్ష‌న్ల‌కు పీసీ హాజ‌రు కాలేక‌పోతోంది. కాల్షీట్ల స‌మ‌స్య కారణంగా ప్రియాంక చోప్రా తన కజిన్ పరిణీతి చోప్రా పెళ్లిని కూడా మిస్స‌యిన సంగ‌తి తెలిసిందే.