Begin typing your search above and press return to search.

వినాయ‌కుడితో ఏమిటా ఆట‌లు మాల్తీ?

ఈ ఉత్స‌వంలో కుమార్తె మాల్తీ మేరీ ఎంతో ఆనందంగా పాల్గొంది. ప్రియాంక చోప్రా జోనాస్ అరుదైన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   22 Sep 2023 12:30 AM GMT
వినాయ‌కుడితో ఏమిటా ఆట‌లు మాల్తీ?
X

పండ‌గ‌లు ప‌బ్బాల‌కు అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా జోనాస్ హంగామా ఎలా ఉంటుందో చూస్తున్న‌దే. తన భ‌ర్త నిక్, కుమార్తె మాల్తీ మేరీతో కలిసి జీవితంలోని విలువైన క్షణాలను ఆస్వాధించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 2018లో వివాహం చేసుకున్న తర్వాత భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌కు పీసీ షిఫ్ట‌యింది. ఇప్పటికీ అత్తింట్లో ప్రతి భారతీయ పండుగను అత్యంత గొప్పగా జరుపుకోవడం చూస్తే సాంప్ర‌దాయాల‌కు పీసీ ఎంత విలువిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా గణేష్ చతుర్థి 2023 శుభ సందర్భంగా గణేశుడిని తమదైన రీతిలో స్వాగతించింది. ఈ ఉత్స‌వంలో కుమార్తె మాల్తీ మేరీ ఎంతో ఆనందంగా పాల్గొంది. ప్రియాంక చోప్రా జోనాస్ అరుదైన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. పీసీ త‌న‌ కుమార్తె మాల్టీ మేరీతో కలిసి తన ఇంటిలో వేడుకలకు సంబంధించిన‌ స్నీక్-పీక్స్ లో ఆకర్షణీయమైన మాల్తీ తన బొమ్మ వినాయకుడితో ఆడుకుంటూ క‌నిపించింది. "ఒక అమ్మాయి .. ఆమె గణపతి (హృదయ కళ్ల ఎమోజి) ఎల్లప్పుడూ మాతో ఉంటారు.. మనం ఎక్కడికి వెళ్లినా.." అని వ్యాఖ్య‌ను జోడించింది. #గణపతిబప్పమోరియా #గణేష్ చ‌తుర్థి అంటూ హ్యాష్ ట్యాగుల్ని పీసీ జోడించింది.

ఈ పోస్ట్ కి 7.8 లక్షలకు పైగా లైక్ లు ద‌క్కాయి. దేశీ గర్ల్ జెన్ 0.2!! అని ఒక అభిమాని ఈ ఫోటోల‌పై వ్యాఖ్యానించారు. వినాయ‌కుడితో ఏమిటా ఆట‌లు మాల్తీ అంటూ మరొక అభిమాని కామెంట్ చేసారు. ఆమె మామా -పాప లాగానే చాలా అందంగా పెరిగింది! అని ఒక నెటిజ‌న్ రాశారు. దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు! అని మరొకరు వ్యాఖ్యానించారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ పోస్ట్‌కి స్పంద‌న‌గా రెడ్ హార్ట్ ఈమోజీను షేర్ చేసారు.

మాల్తీ మేరీ గణేష్ చతుర్థి వేడుకల కోసం తెల్లటి ఫ్రాక్, బ్యాంగిల్స్, బిందీని కూడా ధరించి క్యూట్ గా క‌నిపిస్తోంది. జనవరి 2022లో సరోగసీ ద్వారా జన్మించిన మాల్టీ.. ఇప్పుడిలా స్టఫ్డ్ బొమ్మ వినాయకుడితో ఆడుకుంటూ ల‌వ్ లీగా కనిపించింది. గణేష్ చతుర్థి 2023 వేడుకల సందర్భంగా గణపతి విగ్రహం దగ్గర కూర్చున్న మాల్తీని గట్టిగా కౌగిలించుకుని ముదురు గులాబీ రంగు కుర్తా లో ప్రియాంక చోప్రా క‌నిపించిన ఫోటోని కూడా షేర్ చేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక చోప్రా 'హెడ్స్ ఆఫ్ స్టేట్‌'లో కనిపించనుంది. ఇందులో జాన్ సెనా - ఇద్రిస్ ఎల్బా ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహించారు. నటి రిచర్డ్ మాడెన్‌తో కలిసి అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్‌లో చివరిగా కనిపించింది. రస్సో బ్రదర్స్ వెబ్ షో ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 28న స్ట్రీమ్ అయింది. బాలీవుడ్ లో ఫర్హాన్ అక్తర్ - జీ లే జరాలో అలియా భట్ - కత్రినా కైఫ్‌లతో క‌లిసి పీసీ స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకుంటోంది.