Begin typing your search above and press return to search.

విడాకుల వార్త‌ల న‌డుమ జో జోనాస్ దీపావ‌ళి

LA నుంచి వ‌చ్చిన ఫోటోల్లో దీపావళి వేడుకల కోసం జో జోనాస్, ప్రీతి జింటా స‌హా ప‌లువురితో ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ పోజులిచ్చారు.

By:  Tupaki Desk   |   16 Nov 2023 5:28 AM GMT
విడాకుల వార్త‌ల న‌డుమ జో జోనాస్ దీపావ‌ళి
X

2023 దీపావ‌ళి పండ‌గ ఎప్ప‌టిలానే సంద‌డిగా సాగింది. ఇంటిల్లిపాదీ ఓచోట క‌లిసి దీపాల పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ సెల‌బ్రిటీ పార్టీల సంద‌డి అంతా ఇంతా కాదు. ప‌రిశ్ర‌మలో అగ్ర హీరోలుగా హోదా ఉన్న ప్ర‌ముఖులు వ‌రుస‌గా పార్టీలు ఇచ్చారు. ఈ పార్టీల్లో ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు కనిపించారు. ఈసారి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ దీపావ‌ళి పార్టీల‌ను స్పెష‌ల్ గా సెల‌బ్రేట్ చేసుకుంది. అటు బాలీవుడ్ లో క‌ర‌ణ్ జోహార్, మ‌నీష్ మ‌ల్హోత్రా, శిల్పాశెట్టి, క‌రీనా క‌పూర్ లాంటి ప్ర‌ముఖులు దీపావ‌ళి సంద‌ర్భంగా పార్టీల‌తో చిల్ చేసారు.

అమెరికాలోను తెలుగు వారి దీపావ‌ళి పండుగ ఎంతో వైభ‌వంగా సాగింది. లాస్ ఏంజెల్స్ లోను మ‌న భార‌తీయ పండ‌గ‌ల ప్ర‌త్యేక‌త, దీపావ‌ళి వేడుక‌ల సంద‌డి ఎలా ఉంటాయో జోనాస్ ఫ్యామిలీకి అల‌వాటు చేసింది ప్రియాంక చోప్రా. అమెరికా కోడ‌లిగా ప్ర‌త్యేక గుర్తింపును, హోదాను ఆస్వాధిస్తున్న ప్రియాంక చోప్రా జోనాస్ కుటుంబానికి భార‌తీయ‌ సాంప్ర‌దాయాన్ని అల‌వాటు చేయ‌డం ప్ర‌తిసారీ నెటిజ‌నుల్లో చ‌ర్చ‌గా మారుతోంది. ఓవైపు నిక్ జోనాస్ సోద‌రుడు జో జోనాస్ భార్యతో క‌ల‌త‌ల వ‌ల్ల విడాకుల బాట ప‌డుతున్నాడ‌న్న చర్చ న‌డుమ ఈసారి దీపావ‌ళి పండుగ జోనాస్ ఫ్యామిలీలో ప్ర‌త్యేక టాపిక్ గా మారింది.

LA నుంచి వ‌చ్చిన ఫోటోల్లో దీపావళి వేడుకల కోసం జో జోనాస్, ప్రీతి జింటా స‌హా ప‌లువురితో ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ పోజులిచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ముఖ్యంగా ఈవెంట్లో సొట్ట‌బుగ్గ‌ల ప్రీతిజింతా త‌న భ‌ర్త గూడెన‌ఫ్ తో క‌లిసి క‌నిపించింది. మ‌రొక వైర‌ల్ ఫోటోలో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ - జో జోనాస్ (నిక్ కి అన్న గారు) వారి స్నేహితులు సారా హాడెన్, జెన్నారో, జెస్ డిసిల్వియోలతో ఈ ఫోటోల్లో కలిసి క‌నిపించారు. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ పర్ఫెక్ట్ దీపావళి పార్టీని ప్లాన్ చేసార‌న్న ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. ఈ సంవత్సరం ఈ అంద‌మైన దంప‌తులు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ఉన్నత స్థాయి రెస్టారెంట్‌లో దీపావళి విందును ఏర్పాటు చేశారు. అతిథులంద‌రితో ప్రియాంక చోప్రా పోజులు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ప్రియాంక ఒక మెరూన్ వెల్వెట్ బ్లౌజ్‌తో మ్యాచింగ్ దుపట్టా- గోల్డెన్ లెహంగాతో చాలా అందంగా క‌నిపించింది. నిక్ ప్రింటెడ్ జాకెట్‌తో కూడిన ఆఫ్-వైట్ కుర్తా-పైజామాను ధరించాడు. LA లో దీపావళి సందర్భంగా ప్రియాంక చోప్రా త‌న స్నేహితుల ఇంటికి కూడా వెళ్లారు. నటాషా పూనావల్లతో పోజులిచ్చిన మ‌రో ఫోటో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇది వేరొక చోట జ‌రిగిన‌ దీపావళి పార్టీ నుండి వచ్చిన ఫోటో.

పీసీ-నిక్ జంట‌ కుమార్తె మాల్తీ మేరీతో క‌లిసి త‌మ ఆనంద‌క‌ర జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. నిక్ జోనాస్ -ప్రియాంక చోప్రా డిసెంబర్ 2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌ను జనవరి 2022లో సరోగసీ ద్వారా స్వాగతించారు.