Begin typing your search above and press return to search.

నిర్మాతతో రాజీకొచ్చిన హీరోయిన్

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ పాయల్ రాజ్ పుత్

By:  Tupaki Desk   |   28 May 2024 3:44 AM GMT
నిర్మాతతో రాజీకొచ్చిన హీరోయిన్
X

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ పాయల్ రాజ్ పుత్. ఈ బ్యూటీ మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తర్వాత వరుసగా స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే ఏవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ భాషలలో కూడా పాయల్ రాజ్ పుత్ మూవీస్ చేస్తూ వస్తోంది.

చెప్పుకోదగ్గ సక్సెస్ లు అయితే పాయల్ అందుకోలేకపోతోంది. గత ఏడాది అజయ్ భూపతి దర్శకత్వంలోనే మళ్ళీ మంగళవారం మూవీతో పాయల్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో పాయల్ పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉండగా అందులో రెండు టాలీవుడ్ లో చేస్తున్నవి కావడం విశేషం.

కెరియర్ ఆరంభంలో పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ లో ఓ మూవీ చేసింది. ఫీమేల్ ఒరియాంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం రక్షణ టైటిల్ తో రిలీజ్ కి సిద్ధమవుతోంది. జూన్ 7న విడుదల చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే రక్షణ సినిమా ప్రొడ్యూసర్ పై పాయల్ రాజ్ పుత్ కొన్ని ఎలిగేషన్స్ చేసింది. ఆ మూవీ నిర్మాత ప్రదీప్ ఠాకూర్ తనకి పూర్తి రెమ్యునరేషన్ సెటిల్ చేయలేదని పేర్కొంటూ పోస్ట్ చేసింది.

అలాగే తనని తీవ్ర పదజాలంతో నిర్మాత దూషించారని, ఆ సినిమా విడుదలపై తనకి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తన పోస్ట్ లో పేర్కొంది. దీనిపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నిర్మాత కూడా పాయల్ రాజ్ పుత్ ప్రమోషన్స్ కి రావడం లేదంటూ కంప్లైంట్ చేశారు. దీంతో టాలీవుడ్ లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా ప్రొడ్యూసర్ ప్రదీప్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తమ మధ్య ఉన్న ఇష్యూని పరిష్కరించుకొని రాజీకి వచ్చారంట. నిర్మాతపై ఆమె చేసిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవడంతో పాటు జూన్ 7న మూవీ రిలీజ్ కి చేసుకోవడానికి ఒకే చెప్పిందంట. దీంతో ఇద్దరి మధ్య గొడవకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో పాయల్ రాజ్ పుత్ పార్టిసిపేట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.