Begin typing your search above and press return to search.

రోడ్డు పై పాయల్ క్రేజీ ఫోజులు..!

రోడ్డు పై కాజ్యువల్ గా నడుస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది. మినీ స్కర్ట్ ధరించింది. దానిపై ఓ ఓవర్ కోట్ ధరించింది.

By:  Tupaki Desk   |   14 July 2023 2:25 PM GMT
రోడ్డు పై పాయల్ క్రేజీ ఫోజులు..!
X

ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పూత్. ఆ సినిమాలో ఆమె నటన, అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోయిన్ రేంజ్ కాకపోయినా, మంచి అవకాశాలే అందుకుంటూ కెరీర్ లో ముందకు వెళుతోంది. అయితే, ఈ మధ్య పాయల్ తెరపై కనిపించి చాలా రోజులు అవుతోంది. ఈ క్రమంలో'మంగళవారం' అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఇటీవల విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది.






ఇక, పాయల్ విషయానికి వస్తే, సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి ఉన్న క్రేజ్ అలాంటి ఇలాంటిది కాదు. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 చూసిన తర్వాత ఆమె అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు. ఇక గ్లామర్ విషయంలోనూ ఈ బ్యూటీ పెద్దగా ఎలాంటి ఆంక్షలు పెట్టుకోదు. దీంతో స్క్రీన్ మీద మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

తన ప్రియుడితో కలిసి దిగిన బోల్డ్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన అభిమానులను ఆకట్టుకునేలా ఓ ఫోటో షేర్ చేసింది. రోడ్డు పై కాజ్యువల్ గా నడుస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది. మినీ స్కర్ట్ ధరించింది. దానిపై ఓ ఓవర్ కోట్ ధరించింది. అయితే, ఈ ఫోటోలో ఆమె తన థైస్ షో చేయడం విశేషం. ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు మాయా పేటిక అనే సినిమా చేస్తోంది. మరో వైపు తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఆర్ఎక్స్100 తో హిట్ కొట్టిన అజయ్ భూపతి, ఆ తర్వాత మహా సముద్రం సినిమా తీశారు. సిద్ధార్ధ్, శర్వా లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఈసారి అజయ్ రూట్ మార్చి, ఇంట్రస్టింగ్ కథతో మన ముందుకు రావడానికి రెడీ అయ్యారు. మరి ఈ మూవీతో పాయల్ మళ్లీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి.