Begin typing your search above and press return to search.

బ‌ర్నింగ్ స్టార్ ప‌క్క‌న పాయ‌ల్ ని సెట్ చేస్తున్నారా?

అవ‌కాశాల కోసం పాయ‌ల్ రాజుప్ ఎంత‌లా ప్ర‌య‌త్నాలు చేస్తుందే క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 10:30 AM GMT
బ‌ర్నింగ్ స్టార్ ప‌క్క‌న పాయ‌ల్ ని సెట్ చేస్తున్నారా?
X

అవ‌కాశాల కోసం పాయ‌ల్ రాజుప్ ఎంత‌లా ప్ర‌య‌త్నాలు చేస్తుందే క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది. 'ఆర్ ఎక్స్ 100' తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాల్లో న‌టించినా అమ్మ‌డికి క‌లిసి రాలేదు. తెలుగుతోపాటు క‌న్న‌డ‌లోనూ న‌టించింది. కానీ ఏవి పాయ‌ల్ కి పేరు తీసుకురాలేదు. అందం.. అభిన‌యం..మంచి న‌టి అని పేరున్నా! అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డే ఉంది.

దీంతో లాభం లేద‌నుకున్న అమ్మ‌డు అవ‌కాశాలివ్వండిన డైరెక్ట్ గా అడ‌గ‌డం మొద‌లు పెట్టింది. 'మంగ‌ళ‌వారం' చిత్రంలో పాయ‌ల్ మెయిన్ లీడ్ కి ఎంపికైంది? అంటే కార‌ణం అలా అడిగి అవ‌కాశం అందుకోవ‌డం వ‌ల్లే. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి వేరే హీరోయిన్ కోసం వెతుకుతుండ‌గా...ఆవిష‌యం పాయ‌ల్ కి తెలిసి ఆ ఛాన్స్ నాకివ్వండి....అవ‌స‌రం మేర టెస్ట్ షూట్ చేసి తీసుకోండ‌ని ద‌ర్శ‌కుడిని అభ్య‌ర్ధించింది.

దీంతో అప్ప‌టికే ఆమెతో ఉన్న ప‌రిచ‌యం స‌హా ఆ పాత్ర‌కి సెట్ అవ్వ‌డంతో 'మంగ‌ళ‌వారం'లో ఛాన్స్ అందుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే 'కాంతార‌-2' టీమ్ కూడా న‌టీన‌టులు కావాల‌ని ప్ర‌క‌టించింది. దీంతో పాయ‌ల్ వెంట‌నే లైన్ లోకి ఆ ఛాన్స్ నాకివ్వండి నేను న‌టిస్తాను అని ప‌బ్లిక్ ప్లాట్ ఫాం సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరింది.

మ‌రి పాయ‌ల్ ని వాళ్లు క‌న్సిడ‌ర్ చేస్తారా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ..పాయ‌ల్ మాత్రం ఎంతో ఓపెన్ గా అవ‌కాశం అడిగి త‌న ప్ర‌య‌త్న లోపం లేద‌నిపించింది. మ‌రి ఇలా పాయ‌ల్ అవ‌కాశాలు అడ‌గ‌డం చూసో? లేక నిజంగా త‌న సినిమాలో పాయ‌ల్ అయితే సెట్ అవుతుంద‌నో తెలియ‌దుగానీ..మా సినిమా లో ఛాన్స్ ఇస్తాం న‌టించండ‌ని ఓ యువ నిర్మాత పాయల్ రాజ్ పుత్ ని అప్రోచ్ అయ్యాడుట‌. ఇద్ద‌రి మ‌ధ్య మాట మంతి జ‌రిగిందిట‌. హీరో ఎవ‌రు? అని పాయ‌ల్ రాజ్ పుత్ అడిగితే బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అని చెప్పాడుట‌. అయితే అందుకు పాయ‌ల్ అంగీక‌రించిందా? లేదా? అన్న‌ది తెలియ‌ద‌గానీ..ఇద్ద‌రి మ‌ధ్య డిస్క‌ష‌న్ అయితే అంత‌వ‌ర‌కూ వెళ్లింద‌ని స‌మాచారం.