Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో లాంచ్ అయితే బ‌ట్ట‌లిప్పించేసారు! పాయ‌ల్ ఘోష్‌

'దేవుడి ద‌యవ‌ల్ల సౌత్ సినిమాల ద్వారా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొల‌గించేవారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 9:57 AM GMT
బాలీవుడ్ లో లాంచ్ అయితే బ‌ట్ట‌లిప్పించేసారు! పాయ‌ల్ ఘోష్‌
X

పాయ‌ల్ ఘోష్ బాలీవుడ్ కెరీర్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు తెలుగు.. క‌న్న‌డ‌...హిందీలో సినిమాలు చేసింది. కానీ ఏ భాష‌లోనూ నిల‌దొక్కుకోలేదు. బాలీవుడ్ లో క‌మిట్ మెంట్ పేరుతో లైంగిక దోప‌డీలపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఏకంగా ప‌రిశ్ర‌మకే దూర‌మైంది. ఆ వివాదంతో పాయ‌ల్ మ‌ళ్లీ బాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి బాలీవుడ్ పై త‌న‌దైన శైలిలో విరుచుకు ప‌డింది.

'దేవుడి ద‌యవ‌ల్ల సౌత్ సినిమాల ద్వారా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాను. అలా కాకుండా ముందే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా దుస్తులు కూడా తొల‌గించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకు నేవారు. వాళ్ల‌కి ప్ర‌తిభ‌తో ప‌నిలేదు. దుస్తులు తీసేసి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు అని ఆరోపించింది. ఈ వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా మారాయి. అమ్మ‌డి వ్యాఖ్య‌లు బాలీవుడ్ ప్ర‌తిష్ట‌ని మ‌రింత దిగ‌జార్చుతున్నాయి.

బాలీవుడ్ లో క‌మిట్ మెంట్ వ్య‌వ‌హారం ఎలా ఉంటుంది అన్న‌పై ఇప్ప‌టికే చాలా మంది న‌టీమ‌ణులు సంచ‌లన ఆరోప‌ణ‌లుచేసిన సంగ‌తి తెలిసిందే. కంగ‌నా ర‌నౌత్ లాంటి న‌టి కూడా బాలీవుడ్ పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతుంది. పాయ‌ల్ విష‌యంలో కంగ‌న కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి తాజాగా పాయ‌ల్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎవ‌రైనా స్పందిస్తారా? అన్న‌ది చూడాలి.

గ‌తంలోనూ ఆమె చేసిన ఆరోప‌ణ‌ల విష‌యంలో చాలా మంది మౌనంగానే ఉన్నారు. కొంత మంది ఖండిచే ప్ర‌య‌త్నం చేసే స‌రికి ఇర‌కాటంలోనూ ప‌డ్డారు. పాయ‌ల్ ఘోష్ తెలుగు సినిమా 'ప్ర‌యాణం'తో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత 'ఊస‌రవెల్లి'..'మిస్ట‌ర్ రాస్కెల్'..ఓ క‌న్న‌డ సినిమాలో న‌టించింది. అటుపై బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డామే 'ప‌టేల్ కి పంజాబ్ షాదీ' ..'కోయి జానే నా' లాంటి సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత ఆమె సినిమాలు చేసింది లేదు. బాలీవుడ్ పై ఆరోప‌ణ‌ల‌తోనే మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.