Begin typing your search above and press return to search.

RX బ్యూటీ ఏం చేస్తోంది..?

లాస్ట్ ఇయర్ తనకు RX 100 హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతితోనే మంగళవారం అనే సినిమా చేసింది.

By:  Tupaki Desk   |   8 April 2024 3:30 PM GMT
RX బ్యూటీ ఏం చేస్తోంది..?
X

RX 100 తో టాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ కు ఫేవరెట్ అయిన పాయల్ రాజ్ పుత్ అంతకుముందు పంజాబిలో ఒకటి హిందీలో ఒక సినిమా చేసినా రాని క్రేజ్ RX 100 తో సంపాదించింది. తెలుగులో ఒక సినిమా హిట్టైతే వరుస ఛాన్సులు వస్తాయి. అలా RX 100 క్రేజ్ తో పాయల్ కు అవకాశాలు వచ్చాయి. అయితే వాటిలో ఏ ఒక్కటి పాయల్ రేంజ్ పెంచే స్కోప్ ఇవ్వలేదు. కొన్నైతే RX 100 తరహాలోనే ప్రయత్నించినా కూడా వర్క్ అవుట్ కాలేదు.


లాస్ట్ ఇయర్ తనకు RX 100 హిట్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతితోనే మంగళవారం అనే సినిమా చేసింది. పాయల్ ని నటిగా గుర్తించబడేలా చేయడంలో అజయ్ భూపతి మరోసారి కూడా సక్సెస్ అయ్యాడు. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ పాయల్ దూకుడు చూపిస్తుందని అనుకోగా మళ్లీ వెనకపడింది. ప్రస్తుతం పాయల్ తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాతో పాటుగా తెలుగులో కిరాతక సినిమా చేస్తుంది.

ఓ పక్క మిగతా హీరోయిన్స్ అంతా సూపర్ క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకుంటుంటే పాయల్ మాత్రం కెరీర్ లో ఎలాంటి అవకాశం వచ్చినా చాలు అన్నట్టుగా ఉంది. పాయల్ కు ఉన్న గ్లామర్ ఇమేజ్ ని సరిగా వాడుకుంటే అద్భుతాలు చేయొచ్చు. కానీ అన్నీ కూడా RX 100 తరహా కథలు వస్తుండటం వల్ల పాయల్ కూడా అలాంటి కథలను కాదనేస్తుంది. మంగళవారం సినిమాతో తనకు కూడా ఛాలెంజింగ్ రోల్స్ ఇస్తే వాటికి న్యాయం చేయగలనని ప్రూవ్ చేసుకుంది పాయల్. తనలోని గ్లామర్ సైడ్ ను మాత్రమే కాకుండా నటిమణిని కూడా ఎంకరేజ్ చేయాలని పాయల్ కోరుతుంది.

అజయ్ భూపతి వల్ల రెండోసారి కూడా పాయల్ తన సత్తా చాటగా రాబోయే సినిమాలతో అమ్మడు ఇక తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో కూడా నటించేందుకు సై అంటున్న పాయల్ పై మన మేకర్స్ ఫోకస్ చేయాల్సిందే. ప్రస్తుతం సినిమాలు లేని టైం లో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది అమ్మడు. పాయల్ తిరిగి ఫాం లోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.