Begin typing your search above and press return to search.

సలార్ అస్సలు సినిమా నచ్చలేదు అన్న హీరోయిన్

ఈ ర‌క‌మైన వివాదాల‌తో ఎక్కువ నెట్టింట వైర‌ల్ అవుతుంది. తాజాగా అమ్మ‌డు 'స‌లార్' సినిమాని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 6:16 AM GMT
సలార్ అస్సలు సినిమా నచ్చలేదు అన్న హీరోయిన్
X

బాలీవుడ్ వివాదాస్ప‌ద నటి పాయ‌ల్ ఘోష్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు కొంత కాలంగా వివాదాల‌తో అంట‌గాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అంశంలో అమ్మ‌డి పేరు హాట్ టాపిక్ గా మార‌డం.. అదే దాడిని టైమ్ దొర‌కిన‌ప్పుడ‌ల్లా కొన‌సాగించ‌డంతో మ‌రింత ఫేమ‌స్ అయింది. న‌టిగా కంటే... ఈ ర‌క‌మైన వివాదాల‌తో ఎక్కువ నెట్టింట వైర‌ల్ అవుతుంది. తాజాగా అమ్మ‌డు 'స‌లార్' సినిమాని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల రిలీజ్ అయిన 'స‌లార్' బాక్సాఫీస్ ని వ‌సూళ్లతో షేక్ చేస్తుంటే...పాయ‌ల్ మాత్రం అందో చెత్త సినిమా అని మండిప‌డింది. ఆదివారం సోష‌ల్ మీడియాలో ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో కి వ‌చ్చిన అమ్మ‌డు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే 2023లో రిలీజ్ అయిన సినిమాల‌న్నీ చెత్త‌గానే ఉన్నాయంది. ఒక సినిమా కూడా చూసేలా లేదు.

'డంకీ'..'స‌లార్' కూడా బాగోలేదు. రాజ్ కుమార్ హిరాణీ తొలిసారి త‌న కెరీర్ లో ఓ ప్లాప్ సినిమా తీసాడు. కానీ 'స‌లార్' కి మంచి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ప్ర‌భాస్ ప‌వ‌ర్ పుల్ ప‌ర్స‌న్. ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ వ‌సూళ్లు' అని అంది. అలాగే షారుక్ ఖాన్ న‌టించిన 'జ‌వాన్'..'ప‌ఠాన్' చిత్రాలు కూడా బాగోలేదు. అలాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఏమ‌ర్చుతున్నారు. ఆ రెండు సినిమాలు ఏమంత గొప్ప గా ఉన్నాయి. అవి ఎందుకు న‌చ్చాయో నాకు ఇప్ప‌టికీ అర్దం కాలేదు' అంది.

ఇంత‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మీద ప్ర‌శంస‌లు కురిపించేసింది. ఎన్టీఆర్ జెంటిల్ మెన్ క‌దా? అని ఒక‌రు అన‌గా.. 'అవును. నాకు ఇంకా గుర్తుంది. థాయ్ లాండ్ రోడ్డు మీద బ‌ట్ట‌లు మార్చుకుంటుంటే? నా పై కోప‌ట్టాడు. మ‌హిళ‌ల్ని ఎలా గౌర‌వించలా ద‌క్షిణాది న‌టుల‌కు బాగా తెలుసు. వాళ్లు మ‌హిళ‌ల‌కు ఎంతో గౌర‌వం.. విలువ ఇస్తారు' అని అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పాన్ ఇండియాలో సక్సెస్ అయిన సినిమాల ప‌ట్ల పాయ‌ల్ అలా మాట్లాడ‌టంపై ప‌లువురు మండిప‌డు తున్నారు.