Begin typing your search above and press return to search.

ఇలా పేంప‌ర్ చేస్తే ఎలా పాయ‌ల్!

తాజాగా పాయ‌ల్ ఘోష్ హాట్ ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో అమ్మ‌డు ఎద అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టిస్తుంది.

By:  Tupaki Desk   |   17 Sep 2023 7:30 AM GMT
ఇలా పేంప‌ర్ చేస్తే ఎలా పాయ‌ల్!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ పాయ‌ల్ ఘోష్ బాలీవుడ్ కెరీర్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు తెలుగు.. క‌న్న‌డ‌...హిందీలో సినిమాలు చేసింది. కానీ ఏ భాష‌లోనూ నిల‌దొక్కుకోలేదు. చివ‌రికి బాలీవుడ్ లో క‌మిట్ మెంట్ పేరుతో లైంగిక దోప‌డీలు ఎలా జ‌రుగుతాయ‌న్న‌ది రివీల్ చేసి ఏకంగా ప‌రిశ్ర‌మకే దూర‌మైంది. ఆ వివాదంతో పాయ‌ల్ మ‌ళ్లీ బాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. ఈ వివాదంతో పాయ‌ల్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. పాయ‌ల్ చేదు అనుభ‌వాల‌తో బాలీవుడ్ నే షేక్ చేసింది.


అమ్మ‌డు ఆ స‌మ‌యంలో ఒంటిరిపోరాటం ఎంతో మందిలో స్పూర్తిని ర‌గిలించింది. పాయ‌ల్ చూపించిన ధైర్యంతో మ‌రెంతో మంది లైంగిక దోపిడికి గురైన వాళ్లు మీడియా ముందుకొచ్చి త‌మ గోడును విన్న వించుకున్నారు. ఆ ర‌కంగా పాయ‌ల్ ఘోష్ న‌టిగా కంటే వివాదాస్ప‌ద‌మైన తార‌గా బాగా పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

తాజాగా పాయ‌ల్ ఘోష్ హాట్ ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో అమ్మ‌డు ఎద అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టిస్తుంది. గోల్డ్ క‌ల‌ర్ హెయిర్ స్టైల్...గ్రీన్ క‌ల‌ర్ డిజైన్ లో అమ్మ‌డు ముస్తాబై కెమెరాకి ఫోజులిచ్చింది. అలాగే పాయ‌ల్ రూపంలోనూ చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. గ‌తం కంటే బొద్దుగా త‌యారైంది. స‌న్న‌ని స‌న్న‌జాజిలో ఉండే బ్యూటీ రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

అలాగ‌ని వ‌య‌సైపోయిన బ్యూటీ కాదు. అమ్మ‌డి వ‌య‌సు కూడా 33. కానీ 40 ఏళ్ల వ‌య‌సున్న అమ్మ‌డిలా క‌నిపిస్తోంది. చేతిలో సినిమాలు లేక‌పోవ‌డంతో ఫిట్ నెస్ పై కూడా దృష్టి పెట్టిన‌ట్లు లేదు. అయితే ఇప్పుడీ ఫోటోని ఇన్ స్టాలో ఎందుకు పోస్ట్ చేసిన‌ట్లు? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

బాలీవుడ్ లో వివాదం త‌ర్వాత బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌లేదు. అలాగే ఇన్ స్టాలో ఫోటోలు పోస్ట్ చేసింది లేదు. మ‌రి తాజాగా కొత్త ఫోటో పోస్ట్ వెనుక అర్దం ఏంటో చూడాలి. మ‌ళ్లీ సినిమా ప్ర‌య‌త్నాలు ఏమైనా మొద‌లు పెట్టిందా? అన్న‌ది చూడాలి.