Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ లుక్ లో హీట్ పెంచుతున్న పాయల్..నడుము వయ్యారాలతో!

ముఖ్యంగా బ్లౌజ్ లెహంగా మధ్య నడుమును హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Aug 2025 5:44 PM IST
ట్రెడిషనల్ లుక్ లో హీట్ పెంచుతున్న పాయల్..నడుము వయ్యారాలతో!
X

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే జూనియర్లను మొదలుకొని సీనియర్ స్టార్ హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు తమ అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకొని అటు దర్శక నిర్మాతల దృష్టిలో పడుతున్నారని చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే అవకాశాల కోసం మరో హీరోయిన్ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే తన అందాలతో హీట్ పెంచుతోంది.

ఆమె ఎవరో కాదు పాయల్ రాజ్ పుత్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే ఈమె.. గత రెండు మూడు రోజులుగా ట్రెడిషనల్ లుక్కులో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పింక్ కలర్ లెహంగా ధరించి.. దానికి కాంబినేషన్లో గోల్డెన్ కలర్ స్లీవ్ లెస్ డీప్ వీ నెక్ బ్లౌజ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా బ్లౌజ్ లెహంగా మధ్య నడుమును హైలైట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్రెడిషనల్ లుక్ అంటూనే హాట్ లుక్ లో అందాలను ఆరబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే పాయల్ షేర్ చేసిన ఈ ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే.. 1992 డిసెంబర్ 5న న్యూఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించారు. ఈమె తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే పాయల్ తన తండ్రిని కోల్పోయారు. ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటున్నారు. చిన్ననాటి నుండే నటనపై మక్కువ ఉండడంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

అలా పాయల్ హిందీ టెలివిజన్ సీరియల్ తో పాటు పంజాబీ సినిమా చన్నా మేరేయా (2017) సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.. 2018లో తెలుగు సినిమా ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన ఈ సినిమాలో పాయల్ ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే.. మరొకవైపు విలన్ గా చేసి తన నటనతో అబ్బురపరిచింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఒకవైపు పంజాబీ, హిందీ చిత్రాలలో నటిస్తూనే మరొకవైపు తెలుగులో ఎన్టీఆర్:కథానాయకుడు, సీత, ఆర్డిఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయ పేటిక వంటి చిత్రాలలో నటించింది. ఇక చివరిగా మంగళవారం సినిమాలో నటించి ఒక్కసారిగా భయపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళ్ లో కూడా సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.