స్లిమ్ లుక్‌తో కన్ఫ్యూజ్ చేస్తున్న పాయల్
పాయల్ సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. నిరంతరం తన ఫ్యాషన్ సెన్స్ ని ఎలివేట్ చేసే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
By: Tupaki Desk | 10 July 2025 9:41 AM ISTఆర్.ఎక్స్ 100 చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ ప్రారంభమే బ్లాక్ బస్టర్ అందుకుని టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కెరీర్ ని సాగించిన సంగతి తెలిసిందే. ఆశించిన స్టార్ డమ్ అందుకోకపోయినా కానీ, తనకంటూ కొన్ని అవకాశాలు, కెరీర్ డ్రైవ్ పరంగా ఇబ్బంది ఏమీ లేదు.
ఆర్.ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతితో 'మంగళవారం' అనే నాయికా ప్రధాన చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో పాయల్ నటనకు గుర్తింపు దక్కింది. 2024లో రక్షణ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో గోల్ మాల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఏంజెల్, కిరాతక ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. 'కిరాతక' చిత్రానికి తెలుగు దర్శకుడు వీర భద్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాయల్ సోషల్ మీడియాల్లోను స్పీడ్ గా ఉంది. నిరంతరం తన ఫ్యాషన్ సెన్స్ ని ఎలివేట్ చేసే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా నేవీ బ్లూ ఫ్రాక్ లో కెమెరాలకు ఫోజులిస్తూ కనిపించింది. ఈ ఫోటోషూట్ యూనిక్ స్టైల్ తో పాయల్ ని ఎలివేట్ చేసింది. ఇక పాయల్ మేకోవర్ చాలా షాకిస్తోంది. మునుపటితో పోలిస్తే చాలా స్లిమ్ గా మారిపోయింది. ఆర్.ఎక్స్ 100 చిత్రంలో బొద్దుగా ముద్దుగా కనిపించిన బ్యూటీయేనా ఇలా అయింది? అంటూ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాయల్ మరీ ఇలా డైట్ చేస్తూ బక్క చిక్కిపోవడం కొందరికి నచ్చడం లేదు.
