పాయల్ కిల్లింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోవాలంతే..!
లేటెస్ట్ గా పాయల్ గ్లామర్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటో షూట్ ఆమె ఫాలోవర్స్ ని పిచ్చెక్కిపోయేలా చేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, డెనిమ్ షార్ట్ తో పాయల్ అందాల రచ్చ ఆడియన్స్ కి కనువిందు చేస్తుంది.
By: Tupaki Desk | 6 July 2025 9:48 AM ISTఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఎందుకో కెరీర్ లో వెనకపడింది. మంగళవారం తర్వాత మళ్లీ తిరిగి ఫాంలోకి వస్తుందని భావించినా ఎందుకో అమ్మడు సరైన ఛాన్స్ లు అందుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ రక్షణ అంటూ ఒక అటెంప్ట్ చేసింది కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా చేస్తున్న కిరాతక సినిమాలో నటిస్తుంది పాయల్. ఆ సినిమాతో పాటు తమిళ్ లో గోల్ మాల్, ఎంజల్ అనే రెండు సినిమాలు చేస్తుంది.
అంతకుముందు పంజాబి, హిందీ, తెలుగు, ఒక కన్నడ సినిమా మాత్రమే చేసిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు తమిళ పరిశ్రమకు ఎంట్రీ ఇస్తుంది. ఐతే పాయల్ సినిమాల కన్నా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎప్పుడు నిరాశ చెంద నివ్వదు పాయల్. ఈ క్రమంలో తన ఫోటో షూట్స్ వారిని ఎంటర్టైన్ చేస్తాయి.
లేటెస్ట్ గా పాయల్ గ్లామర్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటో షూట్ ఆమె ఫాలోవర్స్ ని పిచ్చెక్కిపోయేలా చేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, డెనిమ్ షార్ట్ తో పాయల్ అందాల రచ్చ ఆడియన్స్ కి కనువిందు చేస్తుంది. అంతేకాదు ఆ గ్లామర్ షోకి తోడు అమ్మడి ఓర చూపులు మెంటల్ ఎక్కించేస్తున్నాయంటే నమ్మాల్సిందే.
ఒక స్టార్ మెటీరియల్ అయిన పాయల్ రాజ్ పుత్ ఇలా కేవలం ఫోటో షూట్స్ కే అంకితం అవ్వడం ఇబ్బందిగానే అనిపించినా అమ్మడు మాత్రం తన కెరీర్, తన ఫ్యాన్స్ తో సంతృప్తి చెందుతుంది. పాయల్ రాజ్ పుత్ కి సినిమాల ఫలితాలు వాటి వల్ల వచ్చే ఛాన్స్ లు ఎలా ఉన్నా ఇలా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ మైలేజ్ వస్తుంది. మరి అమ్మడు తిరిగి ఫాంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవకాశాలు పెద్దగా రావట్లేదు. ఐతే పాయల్ ఫ్యాన్స్ మాత్రం తమకు ఇలా ఫోటో షూట్స్ చేసినా చాలని అంటున్నారు.
పాయల్ లాంటి అందాల భామ ఇలా కెరీర్ లో వెనకపడం ఆమె ఫ్యాన్స్ ని కలవరపరిచేలా చేస్తుంది. ఐతే రానున్న సినిమాలతో అయినా పాయల్ కి సక్సెస్ వచ్చి తద్వారా మరిన్ని అవకాశాలు రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది జరుగుతుందా లేదా అన్నది ఆ సినిమాలు వచ్చాక తెలుస్తుంది.
