పిక్‌టాక్ : అందాల పాయల్ స్పెషల్ షో
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు మరోసారి ఈమె ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.
By: Tupaki Desk | 8 Jun 2025 9:45 AM ISTఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో జెండా పాతిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పూత్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు, పలు సినిమాల్లో ఐటెం సాంగ్‌ను చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఈ యంగ్ బ్యూటీ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అయింది. ఆర్‌ఎక్స్ 100 సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా ఈ అమ్మడి నటన ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. సాధారణంగా హీరోయిన్స్ అందంతో గుర్తింపు దక్కించుకుంటారు. కానీ పాయల్ రాజ్‌పూత్ మాత్రం తన నటనతోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ ఆ గుర్తింపు కెరీర్‌కి అంతగా హెల్ఫ అవ్వడం లేదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితం అయిన పాయల్ రాజ్ పూత్ నుంచి ఆమె అభిమానులు కమర్షియల్ సినిమాలను ఆశిస్తున్నారు. కానీ ఆమెకు మాత్రం అలాంటి అవకాశాలు దక్కడం లేదు. ముందు ముందు అయినా పాయల్ కి స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కుతాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌గా స్టార్‌డం దక్కించుకోక పోయినా, స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనడంలో సందేహం లేదు.
రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు మరోసారి ఈమె ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. వాతావరణం బాగున్నప్పుడు, మీరు కొన్ని ఫోటోలు తీయడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటారు... అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందమైన ఫోటోలను షేర్ చేసింది. అందమైన ఫోటోలను తీయించుకోవడంలో పాయల్‌కి ప్రేరణ ఉన్నట్లుగానే, ఆమె ఫోటోలను చూడటం వల్ల అభిమానులకు, ఆమె ఫాలోవర్స్‌కి కచ్చితంగా పాజిటివ్ ఎనర్జి అనేది వస్తుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజా ఫోటోల్లో ఈ అమ్మడి అందం అందరిని ఆకర్షిస్తుంది.
సింపుల్ అండ్ స్వీట్ లుక్‌లో థైస్ అందాలను చూపిస్తూ, క్లీ వేజ్ షో తో పాయల్ రాజ్‌పూత్ ఎప్పటిలాగే ఫాలోవర్స్‌ను చూపు తిప్పనివ్వడం లేదు. సాధారణంగానే పాయల్ ఫోటోలు షేర్ చేస్తూ చూపు తిప్పడం కాస్త కష్టమే. అలాంటిది ఇలా స్కిన్ షో చేస్తే, స్పెషల్ షో చేస్తే ఇక ఆగుతారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పాయల్ అందానికి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే.
ఇంతటి అందానికి ఇండస్ట్రీలో దక్కిన గుర్తింపు చాలా తక్కువ అని, పాయల్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ అభిమానులతో పాటు అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. నెట్టింట ఈమె ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ, ఈమె అందం గురించి చర్చించుకుంటున్నారు. ముందు ముందు అయినా పాయల్ ఇండస్ట్రీలో బిజీ స్టార్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
