Begin typing your search above and press return to search.

ముందే నిజం చెప్పేసిన పాయల్ రాజ్‌పుత్.. ఫ్యాన్స్‌కు క్లియర్ మెసేజ్!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో 'సబ్‌స్క్రిప్షన్' ఫీచర్ ద్వారా డబ్బులు సంపాదించడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

By:  Madhu Reddy   |   9 July 2026 12:07 PM IST
ముందే నిజం చెప్పేసిన పాయల్ రాజ్‌పుత్.. ఫ్యాన్స్‌కు క్లియర్ మెసేజ్!
X

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఇన్‌స్టాగ్రామ్‌లో 'సబ్‌స్క్రిప్షన్' ఫీచర్ ద్వారా డబ్బులు సంపాదించడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. యాంకర్ విష్ణుప్రియ వివాదం తర్వాత, ఈ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా తన ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ ఛానెల్ గురించి ఫ్యాన్స్‌కు ముందే ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చేసింది. హాట్ పిక్స్ ఆశిస్తే మాత్రం దండం పెట్టేసి, తన ఛానెల్‌లో ఏం చూపిస్తుందో స్పష్టంగా చెప్పేసింది. ఆ వివరాలు చూద్దాం..





ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ రచ్చ:

కొన్నిరోజుల క్రితం యాంకర్ విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. డబ్బులు తీసుకుని మరీ అసభ్యకరమైన కంటెంట్ పెడుతోందంటూ కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఆ తర్వాత అనన్య నాగళ్ల లాంటి హీరోయిన్లు తమ అకౌంట్లలో ఎలాంటి కంటెంట్ పెడతారో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో పాయల్ రాజ్‌పుత్ కూడా ముందే జాగ్రత్తపడి తన ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చేసింది.

హాట్ పిక్స్ ఆశిస్తే రాకండి:

పాయల్ రాజ్‌పుత్ తన ఇన్‌స్టాలో ఒక స్పెషల్ నోట్ పోస్ట్ చేస్తూ.. "నా సబ్‌స్క్రైబర్ ఛానెల్‌లో నేను ఎలాంటి విషయాలు పెడతానని చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారు. ఒక విషయం ముందే స్పష్టంగా చెబుతున్నా. ఒకవేళ మీరు అసభ్యకరమైన కంటెంట్ లేదా 'హాట్ పిక్స్' ఆశిస్తూ ఇందులో చేరాలనుకుంటే, ఈ ఛానెల్ మీకు అస్సలు సెట్ అవ్వదు" అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది.

కేవలం నా నిజమైన వ్యక్తిత్వం మాత్రమే:

అయితే ఈ ఛానెల్‌లో ఏం ఉంటుందో కూడా పాయల్ క్లియర్ చేసింది. "నా సినిమా షూటింగ్స్ వెనుక ఏం జరుగుతుంది? నా నిజమైన, సహజమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అనేది చూడాలనుకునే వారు మాత్రం హ్యాపీగా ఇందులో జాయిన్ అవ్వచ్చు. నా పరిమితులను అర్థం చేసుకుని, నన్ను గౌరవిస్తున్నందుకు అందరికీ థాంక్స్" అని రాసుకొచ్చింది. అలాగే తన ఇన్‌స్టా క్యాప్షన్‌లో.. "ఈ స్పేస్ కేవలం నా రియల్, అన్‌ఫిల్టర్డ్ లైఫ్ కోసం మాత్రమే.. అంతకుమించి ఏమీ ఉండదు" అని తేల్చేసింది.

'ఆర్‌ఎక్స్ 100' తో భారీ క్రేజ్:

టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వెంకీమామ, ఆర్డీఎక్స్ లవ్, డిస్కో రాజా, జిన్నా, మాయపేటిక వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ‘మంగళవారం’ సినిమాలో తన యాక్టింగ్‌తో అందరినీ మెప్పించింది.

చేతిలో కొత్త ప్రాజెక్టులు:

గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేయగలనని పాయల్ నిరూపించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ‘కిరాతక’ అనే ఆసక్తికరమైన చిత్రంలో నటిస్తోంది. ఇక మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుపుతోంది.

డబ్బుల కోసం కంటెంట్ మార్చకుండా, ముందే తన రూల్స్ ఏంటో చెప్పేసి పాయల్ రాజ్‌పుత్ మంచి పని చేసిందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక అనవసరమైన అంచనాలతో సబ్‌స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత విమర్శించే కంటే, ఇలా ముందే నిజం చెప్పేసి పాయల్ అందరి కంటే ఒక అడుగు ముందే నిలిచింది.