Begin typing your search above and press return to search.

RX బ్యూటీ కంబ్యాక్ ఎప్పుడు..?

మధ్యలో పదుల సంఖ్యలో సినిమా చేసిన పాయల్ రాజ్ పుత్ రెండేళ్ల క్రితం అజయ్ భూపతి డైరెక్షన్ లోనే మంగళవారం సినిమా చేసింది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 1:00 AM IST
RX బ్యూటీ కంబ్యాక్ ఎప్పుడు..?
X

బాలీవుడ్ సీరియల్స్ లో నటించిన పాయల్ రాజ్ పుత్ అజయ్ భూపతి దృష్టిలో పడడం అతను తీసిన ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు ఎంట్రీ ఇవ్వడం ఆ సినిమా సూపర్ హిట్టై అమ్మడికి సూపర్ క్రేజ్ రావడం తెలిసిందే. తెలుగు పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకుంది అంటే దాదాపు కెరీర్ సెటిల్ అయినట్టే లెక్క. ఐతే ఆరెక్స్ లాంటి హిట్ పడ్డాక పాయల్ రాజ్ పుత్ మాత్రం మళ్లీ అలాంటి సక్సెస్ అందుకోలేదు. చేయడానికి సినిమాలైతే చేసింది కానీ వాటి వల్ల ఆమెకు ఉపయోగపడలేదు.

మధ్యలో పదుల సంఖ్యలో సినిమా చేసిన పాయల్ రాజ్ పుత్ రెండేళ్ల క్రితం అజయ్ భూపతి డైరెక్షన్ లోనే మంగళవారం సినిమా చేసింది. ఆ సినిమాతో మళ్లీ పాయల్ తన సత్తా చాటింది. ఐతే ఆ తర్వాత అయినా మళ్లీ కెరీర్ ట్రాక్ ఎక్కుతుంది అనుకుంటే అది జరగలేదు. ఆరెక్స్ 100 తర్వాత ఒకటి రెండు సినిమాలు మళ్లీ అదే తరహా కథలు రాగా అమ్మడు కాదనేసింది. ఐతే ప్రస్తుతం పాయల్ చేతిలో ఆది సాయి కుమార్ కిరాతక ఉంది.

తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది పాయల్. ఈ సినిమాలతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది. ఆరెక్స్ బ్యూటీ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ముఖ్యంగా పాయల్ తన గ్లామర్ తో మరోసారి ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. పాయల్ లాంటి గ్లామర్ బ్యూటీని మేకర్స్ సరిగా ఉపయోగించుకోవట్లేదని చెప్పొచ్చు. ఎలాగు ఆమె గ్లామర్ సైడ్ ఓకే కాబట్టి మంచి కథలను ఎంపిక చేస్తే మాత్రం పాయల్ మంచి సక్సెస్ ఫాం కొనసాగించే అవకాశం ఉంటుంది.

తెలుగులో చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తుంటారు. ఐతే ఆల్రెడీ ఆడియన్స్ లో ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న పాయల్ లాంటి వారికి సరైన అవకాశాలు రావట్లేదు. సరైన సినిమా పడితే మాత్రం పాయల్ అదరగొట్టేయడం పక్కా అని చెప్పొచ్చు. మరి అమ్మడికి మళ్లీ లక్ కలిసి వచ్చే స్క్రిప్ట్ ఏదవుతుంది అన్నది చూడాలి. కోలీవుడ్ లో గోల్ మాల్ సినిమాను పూర్తి చేసిన పాయల్ ప్రస్తుతం ఏంజెల్ సినిమాలో నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పాయల్ ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తుంది. ఐతే రానున్న సినిమాలతో అమ్మడికి ఏమాత్రం సక్సెస్ రేటు అందిస్తాయన్నది చూడాలి.