Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : రెడ్ డ్రెస్‌లో అందాల పాయల్‌

పాయల్‌ రాజ్‌పూత్‌కి ఈ స్థాయి క్రేజ్‌ దక్కడానికి కారణం సినిమాలతో పాటు ఆమె సోషల్‌ మీడియాలో షేర్ చేసే అందమైన ఫోటోలు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   14 April 2025 6:00 PM IST
పిక్‌టాక్‌ : రెడ్ డ్రెస్‌లో అందాల పాయల్‌
X

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో 2018లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఘనత దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి నటన ప్రతిభ ఈ అమ్మడి సొంతం. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రను చేయడం ద్వారా నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ పాయల్‌ రాజ్‌పూత్ నటించి మెప్పించింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా వరుసగా ఐటెం సాంగ్స్‌ను కూడా చేయడం ద్వారా సినిమాల సంఖ్యను పెంచుకుంది. కరోనా సమయంలోనూ ఈమె వరుస సినిమాలు చేసిన విషయం తెల్సిందే.

తెలుగు సినిమాల్లోనే కాకుండా కన్నడం, తమిళ్‌, పంజాబీ, హిందీ సినిమాల్లోనూ ఈమె నటించింది. ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమాలు, తెలుగులో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంగళవారం సినిమాతో పాయల్‌ రాజ్‌పూత్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి ఒక పాత్రలో నటించడం అంటే కచ్చితంగా పెద్ద సాహసం. అలాంటి సాహసోపేత పాత్రలో నటించడం ద్వారా పాయల్‌ రాజ్‌పూత్‌ తనలోని గొప్ప నటిని బయటకు తీసుకు వచ్చిందంటూ చాలా మంది అభినందించారు. మంగళవారం సీక్వెల్‌లోనూ ఆమె నటించాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. కానీ మరో హీరోయిన్‌తో ఆ సీక్వెల్‌ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

పాయల్‌ రాజ్‌పూత్‌కి ఈ స్థాయి క్రేజ్‌ దక్కడానికి కారణం సినిమాలతో పాటు ఆమె సోషల్‌ మీడియాలో షేర్ చేసే అందమైన ఫోటోలు అనడంలో సందేహం లేదు. పాయల్‌ రాజ్‌ పూత్‌ రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. ఇన్‌స్టాలో దాదాపుగా 42 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పాయల్‌ ఈసారి రెడ్‌ డ్రెస్‌లో అందంగా కనిపిస్తూ నెట్టింట అందరిని అలరిస్తుంది. రెడ్‌ డ్రెస్‌లో సాధారణంగానే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. పాయల్‌ అంతకు మించి అందంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాయల్‌ రాజ్‌ పూత్‌ మరికొన్నాళ్లు ఇండస్ట్రీలో టాప్‌లో నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు పదేళ్ల కాలం అవుతున్నప్పటికీ పాయల్‌ అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ముందు ముందు కూడా ఇదే అందంతో మరో పదేళ్ల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. కెరీర్‌ ఆరంభంలో ఈమె చేసిన సినిమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బుల్లి తెరపై, ఓటీటీలో ఈమె నటించిన సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. పంజాబీ సినిమాల్లోనూ నటించడం ద్వారా ఎక్కువ భాషల్లో నటించిన హీరోయిన్‌గా ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. మొత్తానికి పాయల్‌ రాజ్‌పూత్‌ సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూ సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంటుంది.