Begin typing your search above and press return to search.

తెలుగు భాషను మర్చిపోతున్న తెలుగువాళ్ళు.. కన్నడ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు!

కన్నడ నటి పాయల్ రాధాకృష్ణ తెలుగు వారి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

By:  Priya Chowdhary Nuthalapti   |   22 April 2026 8:20 PM IST
తెలుగు భాషను మర్చిపోతున్న తెలుగువాళ్ళు.. కన్నడ హీరోయిన్ కీలక వ్యాఖ్యలు!
X

కన్నడ నటి పాయల్ రాధాకృష్ణ తెలుగు వారి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తన తాజా సినిమా పాపం ప్రతాప్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.

భారతదేశంలో సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను ఎంతో ప్రేమగా భావిస్తారు. ఆ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, గర్వంగా మాట్లాడుతారు. కానీ తెలుగు విషయానికి వస్తే ఈ పరిస్థితి అంతగా కనిపించడం లేదని పాయల్ తెలిపింది. ముఖ్యంగా కొత్త తరంలో చాలా మంది తెలుగు భాషతో తమ అనుబంధాన్ని కోల్పోతున్నారని ఆమె అభిప్రాయపడింది.

పాయల్ మొదటగా తరగతి గది దాటి అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ప్రసన్న వదనం, చౌర్యపాఠం వంటి సినిమాల్లో నటించింది. ఈ ప్రయాణంలో ఆమె తెలుగు భాషను సీరియస్‌గా నేర్చుకోవడం ప్రారంభించింది. కన్నడ, తమిళ భాషలతో పాటు తెలుగు మీద కూడా మంచి పట్టు సాధించాలని ప్రయత్నించింది.

కాలక్రమేణా ఆమెకు తెలుగు మీద ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడిందంట. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలు ఆమెను ఆకట్టుకున్నాయి. 1990లలో వచ్చిన పాటల్లో ఉన్న అర్థం, భావం ఆమెను చాలా ఆకట్టుకున్నాయంట. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, "నాకు 90ల తెలుగు పాటలు చాలా నచ్చాయి. వాటిలో గొప్ప అర్థం ఉంది" అని చెప్పింది.

అయితే ఆ పాటల లిరిక్స్ అర్థం తెలుసుకోవడానికి ఆమె కొంతమంది తెలుగు వాళ్లను అడిగితే ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. ఆమె చెప్పినట్లుగా, "ఇక్కడి వాళ్లను ఆ పాటల అర్థం అడిగితే చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోయారు". అంతేకాదు, "కొంతమంది 90ల పిల్లలు కూడా తెలుగు పదాల అర్థం తెలియదని చెప్పారు" అని ఆమె వెల్లడించింది.

ఈ విషయం పాయల్‌ను ఆశ్చర్యానికి గురి చేసిందంట. మన భాషను మనమే సరిగ్గా తెలియకపోవడం ఎందుకని ఆమె ప్రశ్నించింది. పాయల్ అడిగిన ప్రశ్నకు సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వస్తున్నాయి. నిజంగానే ఈ తరం తెలుగు వారు తమ భాషలోని తీయదనాన్ని మర్చిపోతున్నారు అంటూ కామెంట్స్ లో చేస్తున్నారు.