Begin typing your search above and press return to search.

పవన్ - సూరి... ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!

త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుందట. ఈ సినిమా కి రామ్ తుల్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 3:29 PM GMT
పవన్ - సూరి... ఫ్యాన్స్ నాట్ హ్యాపీ!
X

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో సత్తా చాటాలి అంటూనే, మరోవైపు వరసగా సినిమాలు ఒకే చేస్తున్నారు. ఇప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అవి పెండింగ్ లో ఉండగానే ఆయన కొత్త ప్రాజెక్ట్ లను స్టార్ట్ చేస్తున్నాడు. తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


ఎప్పుడో రెండేళ్ల కిందట ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చారు. కానీ పవన్ బిజీ షెడ్యూల్ ఏజెంట్ ఆలస్యంతో కాంబో ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్ గా మరోసారి సురేందర్ రెడ్డి పవన్ ని కలిసి స్టోరీ చెప్పగా, ఆయన ఒకే చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుందట. ఈ సినిమా కి రామ్ తుల్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ తుల్లూరి, మరో డైరెక్టర్ కమ్ రైటర్ వక్కంతం వంశీ పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. కథ కూడా వక్కంతం వంశీనే అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ పై మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక, డైరెక్టర్ సురేందర్ రెడ్డి వరసగా సైరా నరసింహా రెడ్డి, ఏజెంట్ ప్లాప్ లతో ఉన్నాడు. దీంతో ఫ్యాన్స్ అయితే అసలు హ్యాపీగా లేరు. సురేందర్ రెడ్డి దృవతో మెప్పించాడు కానీ అది రీమేక్.

ఇక చాలా కాలంగా ఆయన టైమింగ్ క్లిక్ కావడం లేదు. కిక్, రేసుగుర్రం లాంటి హిట్స్ కొట్టిన సురేందర్ రెడ్డి ఏజెంట్ తో కూడా అదే స్టైల్ లో హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అది క్లిక్ కాలేదు. మరి ఈసారి పవన్ తో ఏం చేస్తాడో కానీ ఈ అప్డేట్ ఇచ్చాక ఫ్యాన్స్ కాస్త వర్రీ అవుతున్నారు. మొత్తంగా సూరి, పవన్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా, పవన్ కి సంబంధించి మరో వార్త కూడా నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం తన చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటన్నాడట. రీసెంట్ గా పెద్ద మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు చిన్నోడిని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే, మరి ఆ మూవీ సురేందర్ రెడ్డి మూవీ అవునో కాదో తెలియాల్సి ఉంది. ఎందుకంటే, సురేందర్ రెడ్డిమూవీ తో పాటు, సుధీర్ వర్మతో కూడా పవన్ మరో సినిమా తీయాలని అనుకుంటున్నాడు. మరి ఈ రెండింటిలో దేనిలో వైష్ణవ్ నటిస్తాడో చూడాలి. అసలు ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కూడా కొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.