Begin typing your search above and press return to search.

1000 కోట్ల డైరెక్టర్ - పవన్.. అయ్యే పనేనా?

ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ మరేదో కాదు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో లో ఓ సినిమా తెరకెక్కబోతోందట.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:44 AM GMT
1000 కోట్ల డైరెక్టర్ - పవన్.. అయ్యే పనేనా?
X

టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్ గురించే ఇండస్ట్రీ వర్గాల్లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ క్రేజీ కాంబినేషన్ మరేదో కాదు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ - పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటికే కమిట్ అయిన సినిమా షూటింగ్స్ ని పూర్తి చేయని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమాని ఓకే చేసినట్లు టాక్ వస్తుండడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయాల వల్ల పవన్ సినిమా షూటింగ్స్ కి తాత్కాలికంగా తీసుకున్నాడు. ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఒప్పుకున్న సినిమాలను ఫాస్ట్ గా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు', 'OG' వంటి సినిమాలు చేస్తున్నాడు.

వీటిలో ముందుగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న 'OG' షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలకు డేట్స్ కేటాయించనున్నాడు. ఈ ప్రాజెక్టులన్ని పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ అట్లీతో సినిమా చేయబోతున్నారని గుగుసలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాత భాగస్వామిగా ఉంటారని టాక్ వినిపిస్తోంది.

గత ఏడాది 'జవాన్' తో 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసి భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అట్లీ తన నెక్స్ట్ మూవీ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాల్సి ఉంది. బన్నీ తో ప్రాజెక్టు పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పట్టాలకే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి ఈ కాంబినేషన్ అసలు నమ్మేలా లేదనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సినిమాలనే పవన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలియదు.

అలాంటిది అట్లి లాంటి వెయ్యి కోట్ల దర్శకుడు పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే అది అయ్యే పనేనా? అంటూ ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ కాంబినేషన్ కనుక నిజంగా సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదని, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని బద్దలవ్వడం గ్యారెంటీ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా కార్యరూపం దాలుస్తుందో లేదో కాలమే సమాధానం ఇవ్వాలి.