Begin typing your search above and press return to search.

వింటేజ్ లో టీనేజ్ పవన్.. అన్నయ్యతో ఇలా..

అయితే, సోషల్ మీడియాలో తొందరగా పర్సనల్ విషయాలను షేర్ చేయని పవన్ కూడా తన అన్నయ్యకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు.

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:10 AM GMT
వింటేజ్ లో టీనేజ్ పవన్.. అన్నయ్యతో ఇలా..
X

ఆగస్టు 22 వచ్చింది అంటే మెగా ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే ఈ రోజు చిరంజీవి పుట్టిన రోజు. చిరు బర్త్ డే వస్తుంది అంటే చాలు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. వారం ముందు నుంచే హడావిడి చేస్తారు. ఆ రోజు రానే వచ్చింది. నేడే చిరు పుట్టిన రోజు. అందుకే అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


అయితే, సోషల్ మీడియాలో తొందరగా పర్సనల్ విషయాలను షేర్ చేయని పవన్ కూడా తన అన్నయ్యకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పారు. అది కూడా, చాలా రేర్ ఫోటో షేర్ చేయడం విశేషం. ఆ ఫోటోలో చిరంజీవి కేక్ కట్ చేస్తున్నారు. పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ ఫోటోలో పవన్ వయసు పదేళ్లు ఉంటాయో. అంత చిన్న పిల్లాడిలా ఉన్నారు.

అరుదైన చిత్రాన్ని షేర్ చేస్తూ తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలియజేసేలా ఓ క్యాప్షన్ కూడా ఇఛ్చారు. అడుగడుగునా స్పూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిరు, పవన్ కలిసి ఉన్న ఫోటోలు చాలా చూశాం. కానీ, ఈ ఫోటో మాత్రం హైలెట్ అని చెప్పాలి. లైకుల వర్షం, కామెంట్ల వరద కురుస్తోంది.

ఇదిలా ఉండగా, పవన్ ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సినిమా బాగా ఆకట్టుకుంటంది. పొలిటికల్ కౌంటర్లు కూడా చాలా ఎక్కువగా వేశారు. ఆయన చేతిలో ప్రస్తుతం మరో, మూడు చిత్రాలకు పైగా ఉన్నాయి.

ఇక, చిరు తాజాగా భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో ఆయనకు సోదరిగా కీర్తి సురేష్ నటించింది.