Begin typing your search above and press return to search.

పవన్ సినిమా.. రెండు అబద్ధాలే!

వచ్చిన రెండు వార్తలలో కూడా నిజం కాదు అని.. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ తప్పుడు వార్తలకు ఒక ఝలక్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 5:29 AM GMT
పవన్ సినిమా.. రెండు అబద్ధాలే!
X

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగానే గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే విషయం గురించి చిత్ర నిర్మాణ సంస్థ అలాగే దర్శకుడు కూడా మొదటగా పట్టించుకోలేదు. దీంతో గాసిప్స్ డోస్ మరింత పెరిగింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన ఆయన చేస్తున్న ప్రాజెక్టులు కూడా ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు అని విధంగా కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. అలాగే దర్శకులు కూడా మరొక ప్రాజెక్టును మొదలుపెట్టేలా ఆలోచనలు చేస్తున్నారు అని కూడా టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

హరీష్ శంకర్ అయితే మరొక హీరోను లైన్ లో పెట్టేసారు అని త్వరలోనే ఆ ప్రాజెక్టు మొదలవుతుంది అని కూడా వార్తలు అయితే అల్లేస్తున్నారు. ఇక వెంటనే ఈ విషయంపై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది అని దర్శకుడు హరీష్ రవితేజను లైన్ లో పెట్టి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోతున్నట్లుగా ఫేక్ న్యూస్ రావడంతో హరీష్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.

వచ్చిన రెండు వార్తలలో కూడా నిజం కాదు అని.. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ తప్పుడు వార్తలకు ఒక ఝలక్ ఇచ్చారు. మొత్తానికి దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోలేదు అని ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ అయితే ఇచ్చాడు. అలాగే రవితేజతో కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది అనే విషయంలో నిజం లేదని కూడా వివరణ ఇచ్చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం లిస్టులో ఉన్న సినిమాల్లో ఇది కూడా ఎప్పుడో పూర్తవ్వాలి. మరోవైపు యువ దర్శకుడు సుజిత్ తో OG చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీలమల్లు కూడా వెయిటింగ్ లిస్టులో ఉంది. మరోవైపు సురేందర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ వాతావరణం లో చాలా బిజీగా ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమాను ముందుగా ఫినిష్ చేస్తారో చూడాలి.