Begin typing your search above and press return to search.

స‌తీస‌మేతంగా ప‌వ‌న్ ఇట‌లీకి ప‌య‌నం

కొద్ది సేప‌టి క్రిత‌మే ప‌వ‌న్..అన్నా లెజ్నేవా ఎయిర్ పోర్టులో క‌నిపించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట భార్య అన్నా లెజ్నేవా క‌నిపిస్తున్నారు. ప‌వ‌న్ కాట‌న్ జీన్స్... మ‌ల్టీక‌ల‌ర్ గ‌ళ్ల ష‌ర్ట్ ధ‌రించి క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 5:30 AM GMT
స‌తీస‌మేతంగా ప‌వ‌న్ ఇట‌లీకి ప‌య‌నం
X

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 1వ‌తేదిన వివాహం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే వ‌రుణ్ -లావ‌ణ్య లు ఇట‌లీకి వారం రోజులు ముందుగానే చేరుకున్నారు. పెళ్లికి అవ‌స‌ర‌మైన వ‌స్తువ‌ల‌కు సంబంధించి జంట‌గా షాపింగ్ చేసారు. ఆ వీడియోలు...ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.


వీరిద్ద‌రితో పాటు నిహారిక కూడా వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అలాగే మెగా కుటుంబం నుంచి మిగ‌తా సభ్యులంతా కూడా ఇటలీ వెళ్తార‌ని తెలుస్తోంది. వైష్ణ‌వ్ తేజ్ కూడా దీనిలో భాగంగా ముందొస్తుగా ప్ర‌చార కార్య‌క్ర‌మ‌లు ముగించే ప‌నిలో ఉన్నాడు. ఇక అల్లు కుటుంబ స‌భ్యులు కూడా అంద‌రూ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌తీస‌మేతంగా ఇట‌లీకి బ‌య‌ల్దేరిన‌ట్లు తెలుస్తోంది.


భార్య అన్నా లెజ్నేవాతో క‌లిసి ఆయ‌న ఇట‌లీకి వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే ప‌వ‌న్..అన్నా లెజ్నేవా ఎయిర్ పోర్టులో క‌నిపించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట భార్య అన్నా లెజ్నేవా క‌నిపిస్తున్నారు. ప‌వ‌న్ కాట‌న్ జీన్స్... మ‌ల్టీక‌ల‌ర్ గ‌ళ్ల ష‌ర్ట్ ధ‌రించి క‌నిపిస్తున్నారు. చేతిలో న‌ల్ల జాకెట్ కూడా ఉంది. ఆయ‌న హ‌డావుడిగా ప్లైట్ ఎక్కే బిజీ లో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక అన్నా లెజ్నేవా బ్లూ ప్యాంట్..వైట్ ష‌ర్ట్ ధ‌రించి కనిపిస్తున్నారు.


ఇద్ద‌రు చాలా కాలం త‌ర్వాత జంట‌గా మీడియాకి క‌నిపించ‌డం ఇదే తొలిసారి. అప్పుడెప్పుడో అమ‌రావ‌తిలో శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ జంట‌గా క‌నిపించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు క‌లిసి క నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. వాటిని పీకే అండ్ ఫ్యామిలీ ప‌ట్టించుకోలేదు. తాజాగా ఇద్ద‌రు క‌నిపించ‌డంతో! ఆ ర‌క‌మైన నెగిటివ్ క‌థ‌నాల‌కు చెక్ ప‌డింది. అయితే ఇద్దరు పెళ్లికి జంట‌గానే హాజ‌ర‌వుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. పిల్ల‌లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.