Begin typing your search above and press return to search.

థమన్ కష్టాన్ని గుర్తించని పవన్..!

థమన్ గతంలో ఏ సినిమాలు చేశాడు అని పవన్ అడగడం గమనార్హం.

By:  Tupaki Desk   |   26 July 2023 1:18 PM GMT
థమన్ కష్టాన్ని  గుర్తించని పవన్..!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలకు మ్యూజిక్ ఆయనే అందిస్తున్నారు. పవన్ బ్రో, మహేష్ గుంటూరు కారం ఇలా చాలానే క్యూ ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. స్టార్ హీరో సినిమా అంటే, ముందుగా థమన్ నే సంప్రదిస్తున్నారు.

థమన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పవన్ కి చాలా మంచి మ్యూజిక్ అందించిన క్రెడిట్ ఆయనది. బీమ్లానాయక్ లోని పాటలు ఎంత బాగా క్లిక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

అది రీమేక్ సినిమా అయినప్పటికీ, ఆ ఛాయలు కనిపించకుండా చేసింది థమన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. పవన్ రాబోయే చిత్రం ఓజీకి సైతం థమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెంచుకున్నారు.

కాగా, ఆయన ఇప్పుడు పవన్ బ్రోకి కూడా మ్యూజిక్ అందించారు. అయితే, ఈ మ్యూజిక్ మాత్రం పెద్దగా అనుకున్నంతగా క్లిక్ అవ్వలేదు. పాటలు మరీ అంత క్యాచీగా లేవు. దీంతో, థమన్ ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఆ సినిమాకు ఎంత వరకు అవసరమో, అంత వరకు అందించాను అని థమన్ ఇప్పటికే సమర్థించుకున్నారు.

అయితే, నిన్న జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ప్రవర్తించిన తీరు థమన్ ని చాలా ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో పవన్ అందరి గురించి మాట్లాడారు. తన పక్కనే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి చాలా గొప్పగా మాట్లాడతాడుు అని అందరూ అనుకున్నారు. అయితే, పవన్ ఊహించని షాకిచ్చాడు.

థమన్ గతంలో ఏ సినిమాలు చేశాడు అని పవన్ అడగడం గమనార్హం. తన సినిమాకు అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ గురించి పవన్ అలా మాట్లాడటం అందరికీ షాకివ్వగా, థమన్ మాత్రం చాలా డిస్సప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. పవన్ చాలా బిజీగా ఉండి ఉండొచ్చు, చాలా నిజాయితీగా ఉండి ఉండొచ్చు. కానీ, ఇలా థమన్ కష్టాన్ని పవన్ గుర్తించకపోవడం చాలా బాధాకరం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.