Begin typing your search above and press return to search.

'మార్క్ ఆంటోనీ' లో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్‌

ఈ సినిమాలో పవన్ కళ్యాన్‌ రెఫరెన్స్ పెట్టడంతో మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 11:30 AM GMT
మార్క్ ఆంటోనీ లో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్‌
X

విశాల్‌ హీరోగా ఎస్ జే సూర్య ముఖ్య పాత్రలో నటించిన మార్క్ ఆంటోనీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టైమ్‌ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో రూపొందిన సినిమా అవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే తమిళనాట ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్ రావడంతో పాటు మంచి ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి.

ఇక తెలుగు లో కూడా ఈ సినిమా కి మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా హడావిడి చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి కూడా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. విశాల్ గత చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన కూడా ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

విశాల్ కి తెలుగు లో క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమా కి పాజిటివ్ టాక్‌ వస్తే మంచి వసూళ్లు నమోదు అవుతాయని మొదటి నుండి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్‌ రెఫరెన్స్ పెట్టడంతో మేకర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమిళ్ లో స్టార్‌ హీరో అజిత్ రెఫరెన్స్ పెట్టడం జరిగింది.

అక్కడ ఇక్కడ కూడా స్టార్‌ హీరోల ఫ్యాన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. ఇలాంటి చిన్న చిన్న రిఫరెన్స్ ఉన్నా కూడా పవన్ అభిమానులు సినిమాకు పాజిటివ్ టాక్‌ వస్తే కచ్చితంగా థియేటర్ల వద్ద క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది.