Begin typing your search above and press return to search.

పవన్.. ఓ రెండు వారాలు ఇస్తే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:01 AM GMT
పవన్..  ఓ రెండు వారాలు ఇస్తే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. ఈ మూవీ మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై సుజిత్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ సినిమాపై చాలా ఎగ్జైటింగ్ తో ఉన్నారు. దసరాకి ఓజీ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు.

ఇప్పట్లో అయితే సినిమాల కోసం టైం స్పెండ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మొదటిగా ఓజీ కంప్లీట్ చేయడంపై ఫోకస్ చేయనున్నాడంట. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఓ రెండు వారాలు డేట్స్ కేటాయిస్తే ఆయనకి సంబందించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. గతంలో నాలుగు వారాలు డేట్స్ ఇవ్వాలనే ప్రచారం నడించింది. అయితే ఈ రెండు వారాల కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందని టాక్.

మూవీలో పవన్ కళ్యాణ్ కనిపించేది తక్కువ అయిన కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది అని తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ కథని సుజిత్ చెప్పబోతున్నారు. అలాగే పీరియాడికల్ జోనర్ లో కథనం నడుస్తుందంట. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రియా రెడ్డి ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. సుజిత్ ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు ముగిసిన అనంతరం జూన్ లేదా జులైలో ఈ మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహో తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఒజీ చిత్రాన్ని సుజిత్ చేస్తున్నారు. సాహోలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా పకడ్బందీగా ఒజీ కథని సిద్ధం చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీ ఒక మాస్ ఫీస్ట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు. ఈ ఏడాది ఆఖరులో ఆ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.