Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. OG బేరం కుద‌ర‌ట్లేదు

ప్ర‌స్తుతం ఇట‌లీ టుస్కానీలో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి వెళ్లారు

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:58 AM GMT
#గుస‌గుస‌.. OG బేరం కుద‌ర‌ట్లేదు
X

ఓవైపు ఎన్నిక‌లు దూసుకొస్తున్నాయ్. డేట్ ఫిక్స‌యే వేళ ఇది. ఇలాంటి స‌మ‌యంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు అయినా ఏం చేస్తారు? ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తారు. ఎవ‌రికి వారు వ్యూహాలు ప్ర‌తివ్యూహాల‌తో రాజ‌కీయాల్లో బిజీ అయిపోతారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పరిస్థితి అందుకు అతీతం కాదు. అయితే అత‌డితో సినిమాల‌కు అంగీక‌రించిన నిర్మాత‌ల‌కే స‌మ‌స్య‌. సెట్స్ పై ఉన్న సినిమాలు ఎప్ప‌టికి పూర్త‌వుతాయో కొంత గంద‌ర‌గోళం త‌ప్ప‌దు. ఓజీ నిర్మాత‌లు ఇంచుమించు అదే స‌న్నివేశంలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న మూడు సినిమాల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీక‌ర‌ణ‌ నెమ్మదిగా సాగుతోంది. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు పెండింగ్ షూట్ తో పాటు నిర్మాణానంత‌ర ప‌నులు జ‌ర‌గాల్సి ఉంది. OG దాదాపు పూర్తయింది. మ‌రో నెల‌రోజుల పాటు ప‌వ‌న్ డేట్స్ కేటాయించ‌గలిగితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోతుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ సినిమాలో త‌న‌ పార్ట్‌ను ముగించడానికి కనీసం 10 లేదా 15 రోజుల సమయం కావాలని పవన్ కళ్యాణ్ కోరారని, దానిపై అతడు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

ప్ర‌స్తుతం ఇట‌లీ టుస్కానీలో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహానికి హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి వెళ్లారు. మెగా వెడ్డింగ్ లో ప‌వ‌న్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానున్నారు. అయితే పెళ్లి అయిన అనంత‌రం ఓజీ టీమ్ కోసం కాల్షీట్లు కేటాయిస్తారా? అన్న‌ది వేచి చూడాలి. ఎవ‌రి అదృష్టం ఎలా ఉందో ఎవ‌రూ ముందే చెప్ప‌లేరు.

ఓజీ టాప్ క్లాస్ కాస్టింగ్:

ఓజీకి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాహో త‌ర్వాత ఇది అత‌డికి మ‌రో బిగ్ ఛాలెంజింగ్ మూవీ. ఇప్ప‌టికే రిలీజై ప్ర‌మోష‌న‌ల్ మెటీరియ‌ల్ తో ప‌వ‌న్ అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక వేష‌ధార‌ణ‌కు సంబంధించిన‌ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నారు. OG కోసం మ్యూజిక్ స్కోర్‌ను ప్రతిభావంతులైన స్వరకర్త ఎస్.ఎస్ తమన్ అందిస్తున్నారు.