Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ మ‌ర్చిపోయినా పీకే మాత్రం మ‌రువ‌లే!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని నెల‌లుగా పూర్తిగా పొలిటిక‌ల్ గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. చేస్తోన్న సినిమాల‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టేసి అదే ప‌నిలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   5 April 2024 5:30 PM GMT
ఫ్యాన్స్ మ‌ర్చిపోయినా పీకే మాత్రం మ‌రువ‌లే!
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని నెల‌లుగా పూర్తిగా పొలిటిక‌ల్ గా బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. చేస్తోన్న సినిమాల‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టేసి అదే ప‌నిలో ఉన్నారు. సినిమా అనే టాపిక్ లేకుండా జ‌నాల్లో తిరుగుతున్నారు. ప్ర‌చార స‌భ‌ల్లో కూడా ఎక్క‌డా సినిమా అనే ముచ్చ‌ట లేకుండా వారాహి యాత్ర సాగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే ఆయ‌న అభిమానులు అన్ని ర‌కాలుగా పూర్తి మ‌ద్ద‌తుగా ప‌నిచేస్తున్నారు. కూట‌మితో అభిమానులు కాస్త డీవియేట్ అయినా ఆ ప్ర‌భావం పీకే ప్ర‌చారంలో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

భారీ ఎత్తున జ‌న‌సైనికులు హాజ‌ర‌వుతున్నారు. ఈ క్ర‌మంలో సైనుకులు కూడా సినిమా అనే ముచ్చ‌ట లేకుండా ప‌నిచేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎక్క‌డ ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించినా పీకే అభిమానుల నోట సినిమా అనే మాట రాలేదు. గెలుపే ల‌క్ష్యంగా సేనానికి అండగా వంద‌శాతం అభిమానులు ప‌నిచేస్తున్నారు. ఏ స‌మావేశంలో కూడా అన్నా సినిమా అని ఏ అభిమాని కూడా గొంతెత్తి అర‌వ‌డం లేదు. 21 సీట్లు ఇవ్వ‌డంతో సీఎం సీఎం అనే ప‌దం కూడా వినిపించ‌డం లేదు.

ప‌వ‌న్ కళ్యాన్ సినిమా బొమ్మ‌లు ప‌ట్టుకుని గెంతులు వేయ‌డంగానీ...స‌మావేశ ప్రాంగ‌ణంలో సినిమా ప్లెక్సీలు వేయ‌డం గానీ ఏదీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ ఉంది కాబ‌ట్టి క‌నిపించ‌లేదు అనుకోవ‌డానికి లేదు. అంత‌కు ముందు నుంచే ఇదే స‌న్నివేశం క‌నిపించింది. ఇలా అభిమానుల్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌లు అయ్యే వ‌ర‌కూ హోల్డ్ చేయ‌డంలో వంద‌శాతం స‌క్సెస్ అయ్యారు. కానీ సినిమాల సంగ‌తి అభిమానులు మ‌ర్చిపోయినా! నేను మ‌ర్చిపో లేదంటూ పీకే సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్స్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

`ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్`...` ఓజీ` నుంచి కూడా ఈనెల‌లో మ‌రిన్ని అప్ డేట్స్ వ‌స్తాయ‌ని లీకులందుతున్నాయి. ఏమో ఈ గుర్రం ఎగ‌రా వ‌చ్చు అన్న‌ట్లు ఈ స‌మ‌యంలో `హ‌రిహ‌ర వీర‌మల్లు` నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఆ రకంగా అభిమానుల్ని పీకే ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కూ...ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కూ ఎంట‌ర్ టైన్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.