Begin typing your search above and press return to search.

పొలిటికల్ హీట్ లో.. ఉస్తాద్ జోరు!

ప్రస్తుతం ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   14 Sep 2023 6:31 AM GMT
పొలిటికల్ హీట్ లో.. ఉస్తాద్ జోరు!
X

ప్రస్తుతం ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అరెస్టుపై పవర్ స్టార్ కూడా నిరసనలు తెలుపుతూ తిరుగుతున్నారు.

అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పవన్ బిజీగా తిరుగుతుంటే.. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల సంగతేంటి మళ్లీ షూటింగ్ లకు బ్రేకులు తప్పవా? అన్న సందేహాలు అభిమానుల్లో వచ్చాయి. అయితే వీటికి.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీటీమ్ చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో షూటింగ్ సెట్ లోని వర్కింగ్ స్టిల్స్ ను పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైనట్లు తెలిపింది. పవన్ సెట్స్ లోకి వచ్చినట్లు పేర్కొంది. నాన్ స్టాప్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అంటే పవన్ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నట్లు అర్థమైంది.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినా హరీశ్ శంకర్ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం పాటు ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య నుంచే మళ్లీ షూటింగ్ ప్రారంభించుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం, జనసేన సహా ఇతర పార్టీ నేతలతో సమావేశాలకు పవన్ హాజరు కావడం వంటి విషయాలతో షూటింగుకు బ్రేకులు పడ్డాయని అంతా అనుకున్నారు.

కానీ హరీశ్ శంకర్ మాత్రం పవన్ పొలిటికల్ షెడ్యూల్స్, షూటింగ్ షెడ్యూల్స్ క్లాష్ కాకుండా చిత్రీకరణ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ లేనప్పుడు ఇతర సీన్స్ ను పూర్తి చేస్తూ.. ఆయన అందుబాటులో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చేస్తున్నారట.

అలా ఈ క్రమంలోనే బుధవారం(సెప్టెంబర్ 13) పోస్ట్ చేసిన పిక్స్ చూస్తుంటే పవన్, ఇతర నటులపై సన్నివేశాలను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇదే పిక్స్ ను దర్శకుడు హరీశ్ శంకర్ కూడా పోస్ట్ చేస్తూ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తో అన్ కండిషనల్ బాండ్ ఉన్నప్పుడు ఇంతకంటే ఏం అడగగలను అని రాసుకొచ్చారు. ఇప్పటివరకు ఈ సినిమా 40 శాతం చిత్రీకరణ పూర్తైనట్లు తెలిసింది. షూటింగ్ శరవేగంగా జరుగుతుందట.