Begin typing your search above and press return to search.

పవన్ న్యూ కాంబో.. కాపీనా? ఓరిజినలా?

'వకీల్ సాబ్' రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్​లో పెట్టిన ప్రాజెక్ట్స్​లో సురేందర్ రెడ్డి సినిమా కూడా ఒక్కటి.

By:  Tupaki Desk   |   6 Sep 2023 5:34 AM GMT
పవన్ న్యూ కాంబో..  కాపీనా? ఓరిజినలా?
X

'వకీల్ సాబ్' రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైన్​లో పెట్టిన ప్రాజెక్ట్స్​లో సురేందర్ రెడ్డి సినిమా కూడా ఒక్కటి. ఏళ్లు గడుస్తున్నా పట్టాలెక్కని ఈ చిత్రం.. దాదాపు మూడేళ్ల తర్వాత రీసెంట్ గా పనులను ప్రారంభించుకుంది. ఓ ఆఫీస్ ను పూజా కార్యక్రమాలతో ఓపెన్ చేశారు. పవన్ సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు పని చేసిన దర్శక రచయిత వక్కంతం వంశీ.. ఈ చిత్రానికి కథ అందించబోతున్నారు.

అయితే ఇప్పుడీ సినిమా గురించి కొన్ని రూమర్స్ ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఓ హాలీవుడ్ మూవీ స్టోరీ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి కథ సిద్ధం చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇందులోనే పవన్ ప్రధాన పాత్ర పోషించేలా సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ కథను తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో చేసిన ఫ్రీమేక్ ఊసరవెల్లి, ఒరిజినల్ రీమేక్ ధ్రువ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు.

వీటిలో ధ్రువ హిట్ అయినప్పటికీ ఊసరవెల్లి ఫ్లాప్ అయింది. అసలే సురేందర్ రెడ్డి నుంచి రీసెంట్ వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ ను అందుకుంది. దీంతో ఇప్పుడు పవన్ సినిమా కూడా హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ చేయబోతున్నారు అని రూమర్స్ రావడం.. ఫ్యాన్స్ మధ్యలో భారీ స్థాయి హీట్ డిస్కషన్స్ కు దారీ తీసింది. ఆన్ లైన్ ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

అయితే మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీకి సంబంధించిన వర్గాలు ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ లైన్ తోనే రాబోతుందని అంటున్నారు. ఇది సురేందర్ రెడ్డి సొంత కథ అని, దీనికి స్క్రిప్ట్ రైటర్ వక్కంతం వంశీ.. ప్రేక్షకులు ఆదరించేలా జీవం పోస్తారని చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ.. ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకోలేదు. కానీ అప్పుడే ఇలాంటి ప్రచారం చేయడం, సినిమా జడ్జ్ చేయడం సరికాదేమోనని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి సురేందర్ రెడ్డి ఈ సారి ఎలాంటి కథతో వస్తారో పవన్ ను ఎలా ప్రెజెంట్ చేస్తారో..

ఇకపోతే పవన్ ఇప్పటికే కమిటైన OG, 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీరమల్లు' సినిమాలు కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి సురేందర్ రెడ్డి సినిమా ఇప్పట్లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం లేదు. ఇంకా చాలా సమయం పట్టే అవకాశముంటుంది.