Begin typing your search above and press return to search.

పవన్ 'పెద కాపు'.. ఇది అసలు మ్యాటర్

అయితే, ఈ మూవీ టైటిల్ లో కాపు అని పెట్టడం, హీరో పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫోజు ఇవ్వడంతో ఈ మూవీ పవన్ స్టోరీ అంటూ చాలా కాలం పాటు ప్రచారం జరిగింది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 9:25 AM GMT
పవన్ పెద కాపు.. ఇది అసలు మ్యాటర్
X

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం పెద కాపు. ఈ మూవీతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అల్లుడే ఈ విరాట్ కృష్ణ. కాగా, శ్రీకాంత్ రెడ్డి తన స్టైల్ ని మార్చి తీస్తున్న కథ ఇది. అయితే, రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇది రాజకీయ నేపథ్యంలో ఈ మూవీ సాగుతోంది అనే విషయం ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. ఒక్కసారిగా ట్రైలర్ తో మూవీ పై అంచనాలు పెరిగిపోయాయి.

అయితే, ఈ మూవీ టైటిల్ లో కాపు అని పెట్టడం, హీరో పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫోజు ఇవ్వడంతో ఈ మూవీ పవన్ స్టోరీ అంటూ చాలా కాలం పాటు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారానికి మూవీ టీమ్ పులిస్టాప్ పెట్టింది. అందులో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది.

ఈ మూవీ కథకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇక, తాము ఈ మూవీని ఏ కులాన్ని కించపరచాలి అనే ఉద్దేశంతో తీయలేదని చెప్పారు. అలా అని ఏ కులాన్నీ పొగడాలి అనే ఉద్దేశంతో కూడా తీయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో కథనాయకుడు సామాన్యుడికి ప్రతినిథ్యం వహిస్తాడని చెప్పారు.

కులం, పదవి, మతం, డబ్బుతో సంబంధం లేకుండా అందరూ సామాన్యులే అని చెప్పారు. ఇక, ఈ సినిమాలో అన్ని భావోద్వేగాలు చూపించామన్నారు. ఈ కథకు పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదని, నిజానికి, అతను కూడా సామాన్యుడే అంటూ శ్రీకాంత్ అడ్డాల చెప్పడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

తొలిసారి ఈ సినిమాతో హీరోగా మారిన విరాట్ కర్ణ, తనకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ పెదకాపు మూవీ ని ద్వారకా క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ సరసన ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది.

మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీలో విలన్ పాత్ర పోషించడం సినిమాకు అదనపు ఆకర్షణ. చివరగా, శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో కలిసి నారప్ప తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత వస్తున్న సినిమా ఇదే. కాగా, మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.