Begin typing your search above and press return to search.

OG బ్యాంగ్: దీనికోసమే ఫ్యాన్స్ వెయిటింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓజీ మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 5:22 AM GMT
OG బ్యాంగ్: దీనికోసమే ఫ్యాన్స్ వెయిటింగ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ OG. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో ఈ మూవీ వాయిదా పడింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్ళీ షూటింగ్ మొదలు కావొచ్చు.

దసరాకి ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అక్టోబర్ లో ఓజీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ఫెస్టివల్ ఫీస్ట్ ని సుజిత్ ఇవ్వబోతున్నాడు అనే అభిప్రాయం అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సినిమా గురించి ఇంటరెస్టింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా, సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా ఈ న్యూస్ ఉండటం విశేషం.

ఓజీ మూవీలో ఇంటర్వెల్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ గా ఉండబోతున్నాయంట. అలాగే బిగ్గెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ గా దీనిని సుజిత్ డిజైన్ చేస్తున్నాడంట. అదిరిపోయే ఎలివేషన్ షాట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ లో మాసివ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ని అయితే సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్ అన్ని కూడా పవర్ స్టార్ అభిమానులకి అయితే గూస్ బాంబ్స్ తెప్పించే విధంగా ఉంటాయంట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓజీ మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఆ స్థాయిలో పవర్ సునామీ క్రియేట్ చేసే సినిమా చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఓజీ మూవీ అంతకు మించి ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది.

శ్రియా రెడ్డి ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథగా ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి వచ్చిన న్యూస్ కూడా ఫ్యాన్స్ కి ఓజీపై మరింత ఆసక్తి క్రియేట్ చేస్తోంది.