Begin typing your search above and press return to search.

OG: పవన్ ఒక్కడే కానీ..

యంగ్ డైరెక్టర్ సుజిత్ కథల ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా అతను స్క్రీన్ ప్లేతోనే మ్యాజిక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు

By:  Tupaki Desk   |   9 April 2024 5:30 PM GMT
OG: పవన్ ఒక్కడే కానీ..
X

యంగ్ డైరెక్టర్ సుజిత్ కథల ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువగా అతను స్క్రీన్ ప్లేతోనే మ్యాజిక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. అలాగే సుజిత్ మూవీస్ లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. మొదటి సినిమా రన్ రాజా రన్ గాని, తరువాత చేసిన సాహో కాని మేకర్ గా సుజిత్ స్టామినా ఏంటనేది చెప్పే సినిమాలే. అయితే సాహోలో ప్రెజెంటేషన్ ఎంత అద్భుతంగా ఉన్న బలమైన ఎమోషన్ లేకపోవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేదు.

ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఒజీ మూవీ విషయంలో అలాంటి పొరపాట్లకి తావివ్వకుండా బలమైన ఎమోషన్ ని కథలో చూపించబోతున్నాడు. క్యారెక్టరైజేషన్ బలం పెరిగేలా ఈ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయంట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ లీక్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సినిమా కథాంశం 80, 90వ దశకంలో నడుస్తుందని ఇదివరకే ఒక టాక్ వచ్చింది.

ఇక కథ నేపథ్యం బట్టి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మూడు టైమ్ లైన్స్ లో మూడు డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయట. అందులో మాఫియా గ్యాంగ్ కు నాయకుడిగా ఒక క్యారెక్టర్ ఉంటుందట. ఇక ప్రజలు కోరుకునే వ్యక్తిగా మరో షెడ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్యాంగ్ స్టర్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా విభిన్న సమయాలలో కనిపిస్తాడంట. ఈ షేడ్స్ లో పవన్ ఎప్పటికప్పుడు సరికొత్త తరహాలో కనిపిస్తాడని తెలుస్తోంది.

ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతోందని టాక్. సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలలో కనిపించబోతూ ఉండగా ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోర్షన్ కి సంబందించిన 20 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందంట, దీనిలో ఒక ఫారిన్ షెడ్యూల్, రెండు ఫైట్ సీక్వెన్స్, ఒక సాంగ్ షూట్ షూట్ చేయాలంట.

ఈ సినిమాలో రెండు సాంగ్స్ ఉండగా అందులో ఒకటి హీరో క్యారెక్టరైజేషన్ మీదనే ఉంటుందంట. అలాగే చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోన్న టాక్ బట్టి ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్ కానున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ వచ్చినపుడు ఆడియన్స్ నిలబడి విజిల్స్ వేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న ఓజీ సినిమా రిలీజ్ కావడం అయితే పక్కా అని తెలుస్తోంది. రెండు భాగాలుగానే ఈ చిత్రాన్ని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు. మరి పవన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.