Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ 'OG'.. ఆ విషయంలో మూవీ టీమ్ హ్యాపీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'OG' కూడా ఒకటి. మిగతా సినిమాల కంటే ఈ సినిమా పైనే ఇండస్ట్రీలో భారీ బజ్ ఉంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 3:15 AM GMT
పవన్ కళ్యాణ్ OG.. ఆ విషయంలో మూవీ టీమ్ హ్యాపీ!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో 'OG' కూడా ఒకటి. మిగతా సినిమాల కంటే ఈ సినిమా పైనే ఇండస్ట్రీలో భారీ బజ్ ఉంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. సాహో డైరెక్టర్ సుజిత్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మొదటిసారి కలవడం, ఇందులో పవర్ స్టార్ మాఫియా లీడర్ పాత్రలో కనిపించబోతుండటం.. సౌత్, నార్త్ కు చెందిన స్టార్ కాస్ట్ ఈ సినిమాలో భాగం కావడంతో అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇక మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ అంచనాలను పీక్స్ కు చేర్చింది. దాంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మళ్లీ పవన్ సెట్స్ లోకి ఎప్పుడెప్పుడు వస్తారని మూవీ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఒక్కసారి పవన్ సెట్స్ లో అడుగుపెడితే బ్రేకులు లేకుండా సినిమాను పూర్తి చేయనున్నారు మేకర్స్.

ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అదే సమయంలో అవుట్ ఫుట్ ని కూడా చెక్ చేస్తున్నారట.అవుట్ పుట్ విషయంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే చెక్ చేసి బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా మూవీ టీం కసరతులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు షూట్ చేసిన అవుట్ ఫుట్ తో మూవీ టీం ఎంతో హ్యాపీగా ఉందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ అవుట్ పుట్ తో పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ వద్ద కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారట మూవీ టీమ్.

అటు పవన్ కళ్యాణ్ కూడా 'OG' పై మరింత ఆసక్తిని చూపిస్తున్నాడు. అందుకే ముందు ఒప్పుకున్న సినిమాలను పక్కనపెట్టి మరి ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నాడు. ఈ మూవీ కంటెంట్ విషయంలో పవన్ ఎంతో ఎక్సయిటెడ్ గా ఉన్నారట. దానికి తోడు సుజిత్ మేకింగ్ స్టైల్ కి ఫిదా అయినట్లు తెలుస్తోంది.

సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాబట్టి లుక్స్ పరంగా, అవుట్ ఫుట్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ద్వారా అర్థమవుతూనే ఉంది. మొత్తం మీద అవుట్ ఫుట్ తో మూవీ టీం హ్యాపీగా ఉందనే విషయం బయటకు రావడంతో కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు. DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.