Begin typing your search above and press return to search.

పవన్ OG ఖాతాలో మరో రికార్డ్..!

OG ఆడియో రైట్స్ ని సోనీ సంస్థ దక్కించుకుంది. 20 కోట్ల డీల్ తో OG ఆడియో రైట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 10:38 AM GMT
పవన్ OG ఖాతాలో మరో రికార్డ్..!
X

పవర్ స్టార్ పవన్ సినిమా అంటే చాలు ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయి. అన్ని సినిమాలేమో కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యువ దర్శకుడు సుజిత్ తో చేస్తున్న OG సినిమాపై ఫ్యాన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ ని చాలా కాలం తర్వాత ఒక గ్యాంగ్ స్టర్ గా చూడటం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. జస్ట్ శాంపిల్ గా వదిలిన టీజరే ఆ రేంజ్ లో ఉంటే ఇక సినిమా మెంటల్ ఎక్కించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు.

పవన్ OG షూటింగ్ 70 శాతం దాకా పూర్తైనట్లు తెలుస్తుంది. ఇక సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్ అదరగొట్టడం కామనే. ఈ క్రమంలోనే ఓజీ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. OG ఆడియో రైట్స్ ని సోనీ సంస్థ దక్కించుకుంది. 20 కోట్ల డీల్ తో OG ఆడియో రైట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ఒక సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు.

ఇక సినిమాను త్వరగా పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఆగష్టు ఆల్రెడీ పుష్ప రాజ్ ఆక్యుపై చేశాడు. ఆగష్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో పూనకాలు తెప్పించేందుకు పుష్ప 2 వస్తుంది. ఆగష్టు ఫస్ట్ వీక్ నుంచే పుష్ప 2 వైబ్ కనిపిస్తుంది. అయితే OG ఆగష్టు రిలీజ్ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ వచ్చినా అదే నెల చివరి వారం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా OG వస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

కుదిరితే ఆగష్టు లేదా మరో డేట్ తప్పనిసరిగా ఈ ఇయర్ అయితే OGని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. RRR తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న OG సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది.