Begin typing your search above and press return to search.

OG రిలీజ్ పై ఆ క్లారిటీ రావట్లేదు..!

బ్రో సినిమా ఎలాగు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించింది కాబట్టి OG గ్యాంగ్ స్టర్ కథతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందించేలా ఉందని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   29 July 2023 4:30 PM GMT
OG రిలీజ్ పై ఆ క్లారిటీ రావట్లేదు..!
X

పవన్ కళ్యాణ్ బ్రో ఆయన ఫ్యాన్స్ కి మరోసారి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని గుర్తుచేసింది. సాహో తర్వాత సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా పవన్ కెరీర్ లో రాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. గ్యాంగ్ స్టర్ కథతో వస్తున్న ఈ సినిమా లో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంగీతం పరంగా కూడా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

బ్రో సినిమాను పవన్ కేవలం 21 రోజుల్లో పూర్తి చేశారు. టాకీ పార్ట్ మొత్తం చకచకా ఫినిష్ చేశాడు. ఇక ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా విషయంలో కూడా ఇదే ప్లాన్ ని ఫాలో అవుతున్నారట పవన్ కళ్యాణ్. ముంబైలో జరిగిన షెడ్యూల్ లో సినిమా ఎక్కువ శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. ఓజీ సినిమాలో పవన్ మార్క్ మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్ ఉంటుందని తెలుస్తుంది.

బ్రో సినిమా ఎలాగు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించింది కాబట్టి OG గ్యాంగ్ స్టర్ కథతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందించేలా ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

పవన్ కెరీర్ లో ఇప్పటివరకు చేయని భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమా ఎక్కువ శాతం ముంబై లోనే షూటింగ్ జరుపుకుంటుండగా మిగిలిన పార్ట్ మన దగ్గర జరుగుతుందట.

పవన్ ఓజీ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది కూడా క్లారిటీ లేదు. సినిమాను ఈ ఏడాది చివరి కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 22, 23 తేదీల్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తారని టాక్.

కానీ ఈలోగా సినిమా పూర్తి చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. OG సినిమా ఇలా ఉంటే పవన్ డేట్స్ కోసం క్రిష్ హరి హర వీరమల్లు ఎదురుచూస్తుంది. ఆ సినిమా మరో ఆరు నెలలు టైం పట్టేలా ఉంది. ఫ్యాన్స్ కూడా వీరమల్లు సినిమా మీద అంత ఆసక్తిగా లేరు. పవన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది అనుకున్న హరి హర వీరమల్లు సినిమా విషయంలో మేకర్స్ చేస్తున్న లేట్ ఆ సినిమాను ట్రాక్ తప్పేలా చేస్తుంది.